Rice : పురుగులు ఉన్న బియ్యం తింటే ఎలాంటి వ్యాధులు వస్తాయి.? అసలు బియ్యానికి పురుగులు ఎందుకు పడతాయి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rice : పురుగులు ఉన్న బియ్యం తింటే ఎలాంటి వ్యాధులు వస్తాయి.? అసలు బియ్యానికి పురుగులు ఎందుకు పడతాయి..?

 Authored By jyothi | The Telugu News | Updated on :18 March 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Rice : పురుగులు ఉన్న బియ్యం తింటే ఎలాంటి వ్యాధులు వస్తాయి.? అసలు బియ్యానికి పురుగులు ఎందుకు పడతాయి..?

Rice : ఇంట్లో వంటకు సిద్ధమయ్యే ముందు బియ్యాన్ని చేరగడం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. బియ్యానికి పురుగు పట్టిన లేదా అందులో మట్టి వంటి వ్యర్ధాలున్నా వాటిని వేరు చేయడానికి ఇలా చేరుగుతారు. చాలామంది బియ్యాన్ని నిల్వ చేసుకుంటారు. ఇలా దీర్ఘకాలం నిల్వ చేసుకునే బియ్యానికి పురుగులు పట్టడం సాధారణంగా చూస్తుంటాం. నీలువ చేస్తున్న ధాన్యాలకు సాధారణంగా నిస్సి పురుగులు , ముక్కుపురుగులు, లబ్ధిపురుగులు పడుతూ ఉంటాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వెలువరించే పాడిపంటలు పత్రిక చెబుతోంది. ఈ పురుగులు ధాన్యం గింజలను గుల్ల చేస్తాయి. ధాన్యానికి రంద్రం చేసి పొడిచేస్తాయి. ఇలా పొడిగా అయిన బియ్యాన్ని శుభ్రం చేయడం కొద్దిగా కష్టమే అవుతుంది. పైగా పురుగులు పట్టిన బియ్యాన్ని శుభ్రం చేసుకుని తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయని కొందరు వైద్యులు చెబుతున్నారు. సిరి ధాన్యాలతో పోల్చి చూసినప్పుడు వరి, గోధుమలకు, పీచు పదార్థం ఉన్న కవచం తక్కువగా ఉంటుంది. దీని కారణంగానే వరి గోధుమలు నిల్వ చేసినప్పుడు పురుగులు ఎక్కువగా పడతాయని పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలీ బిబిసితో చెప్పారు.

సిరి ధాన్యాల పొట్టులో పీచు పదార్థం కవచనా పనిచేస్తున్న కారణంగా 30 ఏళ్లయినా కూడా వాటికి పురుగులు రావని కానీ వరి బియ్యం గోధుమలకు ఈ పీచు కవచం చాలా తక్కువగా ఉంటుందని అందువలనే వీటికి సులభంగా పురుగులు పడతాయని ఖాదర్ వలీ అన్నారు. ఎలాంటి బియ్యంలోనైనా ఫైబర్ మోతాదు చాలా తక్కువగానే ఉంటుందని ఖాదర్ వలీ చెబుతున్నారు. దంపుడు బియ్యం నల్లబియ్యం అనేవి ఒరిజినల్ బియ్యం వెరైటీలు కాబట్టి పోలీసులు బియ్యం కన్నా పది రెట్లు మేలు అంతేకానీ మొత్తంగా బియ్యానికి జబ్బులను నయం చేసే శక్తి లేదని ఖాదర్ వలీ అంటున్నారు. పీచు పదార్థం తక్కువ ఉన్నప్పుడు ఆ ధాన్యం సహజంగానే బలహీనంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పురుగుల సమస్యను ఎదుర్కోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలను కూడా సూచిస్తున్నారు. ముందుగా బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో కానీ దాని చుట్టూ కానీ తేమ లేకుండా చూసుకోవాలి. తేమ కారణంగా పురుగులు పడతాయని హోమియోపతి డాక్టర్ చెప్పారు. బియ్యం డబ్బాలో ఘాట్ అయిన వాసన ఉండే పదార్థాలు వేయడం వల్ల బియ్యంలోకి పురుగుల చేరకుండా ఉంటాయని ఇంకొందరు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాటిలో వేపాకు బిర్యానీ ఆకు లవంగాలు, ఇంగువ, కర్పూరం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, రాత్రి ఉప్పు వంటి పదార్థాలు ఉన్నాయి. వీటి సాయంతో బియ్యం లో పురుగులు రాకుండా చేయొచ్చు. అలానే వేపాకు లవంగాలు, కర్పూరాన్ని పొడిగా చేసి ఒక గుడ్డలో కట్టి బియ్యం డబ్బాలో వేసిన వాటి వాసనకు పురుగులు పట్టకుండా ఉంటాయని డాక్టర్ చెప్పారు.

కూడా గుడ్డలో కట్టి బియ్యం నిల్వ చేసే డబ్బాల్లో వేస్తారు. అయితే బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండేలా మార్కెట్లో కొన్ని కెమికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. బియ్యానికి పురుగులు పట్టడం అనేది ఆందోళన చెందాల్సిన అంశం కాదని డాక్టర్ అన్నారు. కాబట్టి ఆ వేడికి బియ్యం లో ఏవైనా కీటకాలు మలినాలు ఉన్న బ్యాక్టీరియా ఉన్న చనిపోతుంది. కాబట్టి ఆరోగ్యం పైన పెద్దగా ప్రభావం చూపుతో అజీర్ణ సమస్యల తీవ్రత కూడా తక్కువగానే ఉంటుందని అన్నారు. కీటకాలు చేరిన కారణంగా జబ్బు పడిన కేసులు ఇండియాలో చాలా అరుదని చెప్పారు. పాత కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ మొత్తంలో బియ్యాన్ని దీర్ఘకాలం నిల్వ చేసుకునేవి. కానీ ప్రస్తుతం ఎక్కువగా ఉన్న చిన్న కుటుంబాలు తక్కువ మోతాదులోనే బియ్యాన్ని నిల్వ చేసుకుంటున్నాయన్నారు. బియ్యానికి పురుగులు కీటకాలు పట్టిన కారణంగా జబ్బు బారిన పడ్డవాళ్ళు అత్యంత అరుదని ఖదారవలి అన్నారు. బియ్యానికి పురుగులు పట్టకుండా ఈ మధ్య బోరిక్ పౌడర్ ఆముదం నూనె వంటి వాటిని కూడా బియ్యం డబ్బాల్లో ఉంచుతున్నారని పట్టవర్ధన్ చెప్పారు.

Tags :

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది