Ridge Goud : ఈ కూరగాయను చాలా తేలికగా తీసి పడేస్తారు… ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం లాంటిది….?
ప్రధానాంశాలు:
Ridge Goud : ఈ కూరగాయను చాలా తేలికగా తీసి పడేస్తారు... ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం లాంటిది....?
Ridge Goud : మనం ప్రతిరోజు ఇంట్లో వండుకునే కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. దీన్ని కొందరు ఇష్టంగా తినరు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం వదిలిపెట్టరు.. బీరకాయకు మరో పేరు రిడ్జ్ గుడ్ . భారతదేశంలో చాలా సాధారణంగా తినే కూరగాయ. బీరకాయలో అనేక రకాల పోషకాలు కూడా ఉంటాయి. అందరికీ బీరకాయతో తయారు చేసిన వంటకాలు అంటే ఎంతో ఇష్టం. బీరకాయతో కూర, చట్నీ తో పాటు పలు రకాల వంటకాలను తయారు చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటారు. కూరగాయలతో పోలిస్తే బీరకాయ మృదువుగాను సులభంగాను నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది.
ఈ బీరకాయలో సులభంగా వండుకొని తినవచ్చు. తేలికగా జీర్ణం అవుతుంది. వండిన తర్వాత నోట్లో వేసుకుంటే ఇట్లే కరుగుతుంది. కాబట్టి దీని వండడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. అంతే, కాకుంటా ఇతర కూరలతో కలిపి కూడా సులభంగా వండుకోవచ్చు. అలాగే తినవచ్చు. పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు… బీరకాయ ప్రయోజనాలు తదితర వివరాలు తెలుసుకోండి….

Ridge Goud : ఈ కూరగాయను చాలా తేలికగా తీసి పడేస్తారు… ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం లాంటిది….?
Ridge Goud : పోషకాలు సమృద్ధిగా ఉంటాయి
బీరకాయలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఒక రకమైన కూరగాయ. బీరకాయలో విటమిన్ సి,విటమిన్ ఎ, విటమిన్ కె, పోలేట్,పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. అంశాన్ని మన శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరం… అందుకే బీరకాయను తినాలని నిపుణులు సూచిస్తున్నారు..
బరువును నియంత్రిస్తుంది ఉబకాయాన్ని తగ్గిస్తుంది : బీరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, శక్తికి మూలంగా ఉంటుంది. బీరకాయలు అధిక మొత్తంలో నీరు, ఫైబర్ కూడా ఉంటాయి. ఆహారాన్ని నిలువ చేస్తుంది. ఎక్కువసేపు ఆకలి అవ్వనివ్వదు. కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ అద్భుతమైన ఎంపిక.
జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది : బీరకాయలో ఫైబర్ ఉంటుంది. దీనిలో పీచు పదార్థము ఉండడు చేత జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. తద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కాయ తింటే సాధారణంగా గ్యాస్ లేదా అజీర్ణం గురించి ఆందోళన, చెందాల్సిన అవసరం ఉండదు. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. సిజరింగ్ అయిన పేషంట్లకి ఈ బీరకాయని ఎక్కువగా పెడుతుంటారు. ఎందుకనగా ఇది, త్వరగా జీర్ణం అవుతుంది. కావున, ఆపరేషన్ చేయించుకున్న వారికి ఈ బీరకాయని ఎంపికగా చేసుకుంటారు.
గుండెకు మేలు చేస్తుంది : బీరకాయలో అధికంగా పొటాషియం కూడా ఉంటుంది. కావున, రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇది తినడం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు.
ప్రేగులను శుభ్రంగా – ఆరోగ్యంగా ఉంచుతుంది : బీరకాయలో ప్రేగులను శుభ్రంగా – ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రేగులను శుభ్రపరిచే గుణాలు, లక్షణాలు దీనికి ముఖ్యంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ- ఫైబర్ కూడా ఉంటాయి. ఇది కడుపుని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.