Tongue Colour : వైద్యుడు రోగి నాలుక రంగుని బట్టి ఏ రోగం ఉందో ఏలా చెప్తాడో మీకు తేలుసా ?
Tongue Colour : మనకు ఎదైనా ఆనారోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దెగ్గరకు వెళ్ళతాము. వెళ్ళినప్పుడు వైద్యుడు ముందుగా నోరు తెరవ్వండి అని చెప్పి నోటిలోనికి టార్చ్ లైట్ వెసి నాలుకను పరిక్షించి చూస్తాడు . ఎందుకంటే నాలుక యొక్క రంగుని బట్టి వైద్యుడు రోగికి వచ్చిన వ్యాధిని నిర్ధారణ చేయగలుగుతాడు .అయితే మన శరీరంలో పంచేద్రియాలలో ఒకటైనది నాలుక . ఈ నాలుక కూడా చాలా ముఖ్యమైనది . దిని విశిష్టత ఎంతంటే ..నరం లేని నాలుక ,నోట్లో నాలుక లేనివాడు , వంటి నానుడితో ఎదుటి వారి వ్యక్తిత్వాన్నిచెప్పకనే చెప్పేస్తారు. మనం తిన్న ఆహరంను లోపలికి పంప్పాలన్న , పంటికిందకు ఆహరంను నమిలేలా చేయాలన్నా ఈ నాలుక ఎంతో సహయపడుతుంది.ఇది లేకపోతే మాట్లాడలేము ,రూచిని ఆస్వాధించలేము, ఇటువంటి నాలుక మన శరిరంలో కీలక పాత్రను కలిగి ఉంటుంది. అయితే సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క నాలుక సన్నని ,తెల్లటి పూతతో గులాబి రంగులో ఉంటుంది. మరి మన నాలుక ఏ రంగులో ఉంటే ఏ వ్యాధి ఉందో తెలుసుకుందాం ….!
Tongue Colour : వైద్యుడు రోగి నాలుక రంగుని బట్టి సమస్య ఏలా తెలుసుకుంటాడో మీకు తేలుసా ?
Tongue Colour : నాలుక ఎరుపు రంగులోకి మారితే విటమిన్ – బి లోపం ,పోలిక్ యాసిడ్ లోపం ఉందని గమనించాలి.వైరల్ ఇన్ఫెక్షన్స్ తో జ్వరం వచ్చినప్పుడు కూడా నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది.అలాగే మీ కాలుక తెల్లగా పాలిపోయి ఉంటే మీ నోరు శుభ్రంగా లేదని అర్ధం .అంతే కాదు మీ శరీరంలో నీటి శాతం తగ్గింది , మీ శరీరం డీహైడ్రెషన్ కి గురిఅయింది అని సూచిస్తుంది.అలాగే సిజన్లలో వచ్చే వ్యాధులు `ప్లూ ` బారిన పడినవారికి కూడా నాలుక తెల్లగా మారుతుంది.రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉందని కూడా సూచిస్తుంది.అంతేకాదు ఐరన్,ప్రోటిన్ల లోపం వలన నాలుక తెల్లగా మారుతుంది .కావునా నాలుక తెల్లగా మారకూండా ఉండాలంటే మనం తినే ఆహరంలో ప్రోటిన్ల లోపం లేకుండా చూసుకోవాలి.
నాలుక ఊదా రంగులో ఉంటే రక్తం ప్రసరనలో గాని,గుండెకు సంబందించిన సమస్యలు ఉన్నట్లు గమనిస్తారు, అలాగే కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు సూచిస్తుంది .బ్యాక్టిరియా పెరుగుదల వలన నాలుక పసుపు రంగులోకి మారుతుంది.నాలుకపై అపరిశుభ్రత , పోడిబారిన నాలుక ఇటువంటివి నాలుకపై ,నోట్లో బ్యాక్టిరియా పెరుగుదలకు కారణం అవుతాయి.నాలుక పసుపు రంగులో ఉంటే మీకు జీర్ణ సంబందిత వ్యాధులు , కాలేయ సంబందిత వ్యాధుల వంటి వాటిబారిన పడతారని ముందుగా సంకేతం తెలుపుతుందని చెప్పవచ్చు.
నాలుక నారింజ రంగులోకి మారితే ఆ నోరు పరిశుభ్రంగా లేదని అర్ధం.అలాగే పోడిబారిపోవడం వంటివి సమస్యను కూడా చూచిస్తుంది.కెరాటిన్ పెరుకపోవడం వలన నాలుక నల్లగా మారుతుంది.కెరాటిన్ అనేది ,చర్మం, జుట్టు,గోళ్ళలో ఉండే ప్రోటిన్.అంతే కాదు ఎక్కువగా యాంటిబయాటిక్స్ తిపుకునేవారిలో నాలుక పసుపు రంగులోకి మారుతుంది.గోదుమ రంగు నాలుక ఎక్కువగా కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహరపదార్ధాలను తిసుకునే వారిలోను,పోగ ఎక్కువగా తారేవారిలోను ఈ రకమైన రంగును కలిగి ఉంటుంది.అలాగే రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటే ఆ నాలుక నీలం రంగులోకి మారుతుంది.గుండెకు రక్తంను సరిగ్గా సర్ఫరా చేయలేనప్పుడు ,రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం మొదలైనప్పుడు నాలుక నీలం రంగులోకి మారుతుంది.ఇటువంటి లక్షణాలను బట్టి వైద్యుడు రోగి నాలుకను పరిక్షించి వ్యాధిని నిర్ధారణ చేయగలుగుతాడు .