Sesame Seeds : తక్షణ శక్తిని, పుష్టిని ఇచ్చే నువ్వుల లడ్డు గురించి కొన్ని నిజాలు…!
ప్రధానాంశాలు:
Sesame Seeds : తక్షణ శక్తిని, పుష్టిని ఇచ్చే నువ్వుల లడ్డు గురించి కొన్ని నిజాలు...!
Sesame Seeds : నువ్వులలో శరీరానికి అవసరమయ్యే విటమిన్స్ మినరల్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. నువ్వుల లడ్డు తరచు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. వంటల్లోనే కాకుండా నువ్వులతో తీపిపదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. వాటిలో నువ్వుల లడ్డులు కూడా ఒకటి. స్వీట్ షాప్ లో దొరికే విధంగా నువ్వు లడ్డుల్లో మనమే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలు తినడం వల్ల రుచి తో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు..
పలు రకాల క్యాన్సర్లు, టైప్ టు డయాబెటిస్ రాకుండా ఉంటాయి.
నువ్వు లడ్డు నిత్యం తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నువ్వులు మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తాయి. మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు అందుతాయి. బ్లడ్ షుగర్ ఉన్నవారు నువ్వులను తింటే మంచిది. బీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. అలాగే నువ్వుల ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. నువ్వుల నూనె రాసుకుంటే ఎలాంటి నొప్పులైన తగ్గిపోతాయి అన్న సంగతి తెలిసిందే.. అయితే నువ్వులను తిన్నా కూడా నొప్పులను తగ్గించుకోవచ్చు..
నువ్వులలో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. ఇక నువ్వులను తినడం వల్ల మన శరీరానికి కావలసిన విటమిన్ లు, బి 1, బి3 బి6 లు అందుతాయి. నువ్వులను నిత్యం తినడం వల్ల వాటిలో ఉండే ఐరన్ మన శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. రక్తహీనత ఉన్నవారు నిత్యం నువ్వులను తింటే ప్రయోజనం కలుగుతుంది. అలాగే టైప్ టు డయాబెటిస్ ఉన్నవారు నువ్వులను తింటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.. ఎన్నో పోషకాలు ఉన్న నువ్వుల లడ్డు ప్రతిరోజు తింటే మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది..