Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులకు మినప్పప్పుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో…!!
Diabetes : మినప్పప్పును మనం ఎక్కువగా ఇడ్లీలు, దోశలు, వడలు లాంటి అల్పాహారంలో ఉపయోగిస్తాము. వీటికి ఈ పప్పు చాలా ముఖ్యమైనది. అంతేకాక ఆయుర్వేద వైద్యంలో కూడా పక్షవాతం, ఆస్తమా,ఆర్థరైటిస్ లాంటి వ్యాధులను నయం చేయడంలో ఈ పప్పును ఎక్కువగా వాడతారు. అయితే ఈ పప్పులో విటమిన్ బి మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే ఈ మినప్పప్పును తీసుకోవడం వలన తలనొప్పి మరియు జ్వరం,ఇంప్లమేషన్ లాంటి సమస్యల నుండి కూడా ఈజీగా బయటపడవచ్చు. అయితే ఇది డయాబెటిస్ పేషెంట్లకు మాత్రమే కాదు అందరికీ కూడా ఎంతో బలమైన ఆహారం. దీనిలో ఉన్న ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ మినప్పప్పు అనేది కిడ్నీలను రక్షించడంలో కూడా ఎంతో అద్భుతంగా పని చేస్తాయి… డయాబెటిస్ పేషెంట్లకు ముఖ్యంగా కావలసింది ఎంతో హెల్తీగా ఉండే ఫుడ్. అనగా ప్రోటీన్లు మరియు ఫైబర్ లాంటివి ఎక్కువగా ఉండే ఆహారాలు కచ్చితంగా తీసుకోవాలి.
అలాగే ప్రోటీన్ మరియు ఫైబర్ ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యం అనేది ఎంతో మెరుగ్గా ఉండడమే కాక బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. దీనికి ముఖ్యంగా ఈ మినపప్పు ఎంతో అద్భుతంగా పని చేస్తుంది అని అంటున్నారు నిపుణులు. దీనిలో ఉన్న పోషకాలు ఎముకలను దృఢంగా చేయడంలో ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఈ పప్పు అనేది ఘట్ హెల్త్ ను మెరుగుపరచడమే కాక శరీరంలోని ఐరన్ లెవల్స్ ను పెంచేందుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా మరియు ఎంతో దృఢంగా ఉంచడంలో కూడా మేలు చేస్తుంది. అలాగే నాడీ బలహీనత మరియు పాక్షిక పక్షవాతం, ముఖ పక్షవాతం,రుగ్మతలను నియంత్రించడంలో కూడా ఇతర రకాల ఆయుర్వేద ఔషధాలలో ఈ మినప్పప్పును ఎక్కువగా వాడతారు. ఈ మినప్పప్పు అనేది మధుమేహ సమస్యతో బాధపడే వారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ మినప్పప్పు అనేది గ్లూకోజ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. దీనిలో ప్రోటీన్లు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే దీనిలో పొటాషియం, ఐరన్, ఫోలేట్, కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. అలాగే ఈ మినప్పప్పు లో రెండు రకాలు ఉన్నాయి. ఈ రెండిటిలో తొక్కతో ఉన్న మినప్పప్పు ఎంతో ప్రయోజనకరం…
ముఖ్యంగా చెప్పాలంటే మహిళల సౌందర్య పోషణలో మినప్పప్పు ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో విటమిన్స్ అండ్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది సన్ టాన్స్ ను కూడా తొలగిస్తాయి. అలాగే ఈ మినప్పప్పు లో ఉండే పోషకాలు ఆరోగ్యవంతమైన జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాక ఈ మినప్పప్పు బరువును నియంత్రించడంలో కూడా మేలు చేస్తుంది. అలాగే మొటిమల సమస్యతో ఇబ్బంది పడేవారు మినప్పప్పును కొద్దిగా పాలల్లో వేసుకొని నూరుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం,తేనె కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీళ్ళ తో ముఖాన్ని క్లీన్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాక పురుషుల లైంగిక సమస్యలను తగ్గించటంలో కూడా మినప్పప్పు ముఖ్య పాత్ర పోషిస్తుంది…