Weight Loss : అధిక బరువుతో బాధపడే వారికి గుడ్ న్యూస్… ఈ ఐదు ఆహారాలను డైట్ లో చేర్చండి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Weight Loss : అధిక బరువుతో బాధపడే వారికి గుడ్ న్యూస్… ఈ ఐదు ఆహారాలను డైట్ లో చేర్చండి..?

 Authored By ramu | The Telugu News | Updated on :18 January 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Weight Loss : అధిక బరువుతో బాధపడే వారికి గుడ్ న్యూస్... ఈ ఐదు ఆహారాలను డైట్ లో చేర్చండి..?

Weight Loss : ప్రస్తుత సమాజంలో నానాటికి అధిక బరువు Weight Loss అనే సమస్య పెరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాట్ తో బాధపడుతున్నారు. ఫ్యాట్ ని కరిగించుకొనుటకు వ్యాయామాలు కూడా చాలా కష్టంగా చేస్తున్నారు. వ్యాయామాలు చేయడం కన్నా ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. పండ్లు,పాలకూర, పెరుగు, దోసకాయ, బఠానీలు వంటివి ఆహారాలు బరువు తగ్గడంలో కీలక పాత్రను పోషిస్తాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి కావున శరీరానికి తగిన శక్తిని అందిస్తాయి. పైగా ఆకలి కూడా తగ్గిస్తుంది, ఎందుకంటే ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణ క్రియ మెరుగుపడే బరువు తగ్గటానికి స్వలభ తరం అవుతుంది. పైగా ఇవి శరీరానికి తక్షణమే శక్తిని అందించి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
నేటి సమాజంలో చాలామంది ఉబకాయ సమస్యతో బాధపడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. బరువు తగ్గాలి అని కఠినమైన వ్యాయామాలు చేయటమే సరైన పద్ధతి కాదు. ఆహారపు అలవాట్లు కూడా అనుసరించడం ద్వారా బరువు తగ్గటం సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు Food అలవాట్లు, మంచి ఆహారంఆహారం తినడం వంటి వాటి వల్ల పోషకాలు అందుతాయి. ఇలా చేస్తే అధిక బరువు కూడా తగ్గించుకోవచ్చు. తగ్గాలంటే తేనె ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇప్పుడు ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం…

Weight Loss అధిక బరువుతో బాధపడే వారికి గుడ్ న్యూస్ ఈ ఐదు ఆహారాలను డైట్ లో చేర్చండి

Weight Loss : అధిక బరువుతో బాధపడే వారికి గుడ్ న్యూస్… ఈ ఐదు ఆహారాలను డైట్ లో చేర్చండి..?

Weight Loss పెరుగు

పెరుగు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది,జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఈ పెరుగులో ప్రో బయోటిక్స్ శరీరంలో మెటబాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజువారి ఆహారంలో పెరుగుని చేర్చుకుంటే బరువు కూడా తగ్గించుకోవచ్చు.

దోసకాయ : కాయలు 85% నీరు ఉంటుంది. అలాగే దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దోసకాయ తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఈ దోసకాయలో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ప్రతిరోజు ఆహారంలో దోసకాయని చేర్చుకుంటే శరీరంలో చెడు కొవ్వు తగ్గిపోతుంది. తక్కువ క్యాలరీల ఆహారం కాబట్టి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

పండ్లు : మనకు దొరికే పండ్లలో బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. పండ్ల లో ఫైబర్,విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో తక్కువ క్యాలరీలు ఉండడంతో పాటు తక్షణ శక్తిని కూడా అందిస్తాయి. ఉండడం వల్ల శరీరానికి ఎక్కువ సమయం నిండుగా అనిపించేలా చేస్తుంది. ఆకలి అనేది వేయదు. తద్వారా ఎక్కువగా ఆహారం తినాల్సిన అవసరం ఉండదు. వాహనం తినకపోవడం వల్ల బరువు కూడా తగ్గిపోవచ్చు.

Weight Loss బఠానీలు,చిక్కుళ్ళు

చిక్కులలో ఉండే ప్రోటీన్ ఫైబర్ శరీరానికి అవసరమైన బలాన్ని అందిస్తుంది. బీన్స్,బఠానీలు వంటివి ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఇవి కేవలం ఆకలి నియంత్రించడమే కాదు అధిక బరువును కూడా తగ్గించడంలో కీలకపాత్రను పోషిస్తాయి.

పాలకూరతో అధిక విటమిన్లు : పాలకూరలో విటమిన్ ఏ,సి,ఇ,కే తో పాటు పొటాషియం క్యాల్షియం ఐరన్ వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. క్యాలరీలు తక్కువ ఉన్న ఫుడ్డు ఉండడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. తగ్గాలనే వారికి ఇది అద్భుతమైన ఆహారం. బరువు తగ్గాలనే వారికి ఆహారపు అలవాట్లు విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. పైన చెప్పిన విధంగా రోజువారి ఆహారంలో భాగంగా చేస్తే శరీరం మార్గకరంగా ఉండటమే కాదు బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు. మీ ఆహారంలో పెరుగు, పాలకూర, చిక్కుళ్ళు,పండ్లు, దోసకాయ వీటిని చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు తలెత్తవు. వీటన్నిటిలో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. గ్యాలరీలు తక్కువగా ఉన్న ఆహార పదార్థాన్ని తింటే అధిక బరువును తగ్గించుకోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది