Weight Loss : అధిక బరువు తగ్గించుకొవాలను కుంటున్నారా.. అయితే ఈ డ్రింక్స్ కి దూరంగా ఉండండి…?
ప్రధానాంశాలు:
Weight Loss : అధిక బరువు తగ్గించుకొవాలను కుంటున్నారా.. అయితే ఈ డ్రింక్స్ కి దూరంగా ఉండండి...?
Weight Loss : బరువు తగ్గాలి అనుకునేవారు గంటల తరబడి Weight Loss వ్యాయామాలు చేయటమే కాదు.. తీసుకునే ఆహారంలో కూడా శ్రద్ధ పెట్టాలి. అలాగే తాగే డ్రింక్స్ మీద కూడా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే డ్రింక్స్ లో క్యాలరీలను ఎక్కువగా ఉంటాయి. కావున ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపుటంలో బరువు తగ్గటం వంటి వాటిని అడ్డుకుంటాయి. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరిని బాధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గాలి అంటే తక్కువ క్యాలరీలు ఉన్న ఆహార పదార్థాలను తినడంతో పాటు వ్యాయామం కూడా చేయాలి. ఇందులో ప్రధాన పాత్ర ఆహారం. మనం రోజు దినచర్యలో ఆహారంతో పాటు భోజన సమయాలు ఆహార పరిణామం జీర్ణక్రియ వంటి ఇతర విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.
Weight Loss ఈ పానీయాలు అస్సలు ముట్టుకోకూడదు
బరువు తగ్గే క్రమంలో చాలామంది డ్రింక్స్ ను విస్మరిస్తుంటారు. ఇది తెలియకుండానే బరువును తగ్గే విధాన్ని అడ్డుకుంటుంది. బరువు తగ్గాలి అని అనుకునేవారు ఈ క్రింద పానీయాలు అస్సలు ముట్టుకోకూడదు. బరువు తగ్గాలని అనుకునేవారు పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. పండ్ల రసాలలో ఫైబర్ ఉండదు. పూర్తి క్యాలరీలు,చక్కెరలు ఉంటాయి. కావున ద్రవాలకు బదులు, పండును యధాతధంగా తినడం మంచిది. అయితే కార్బోనేటెడ్ కలిగిన డ్రింక్స్ పోషకాహారం లేనివి. ఈ డ్రింక్స్ లలో చక్కర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో సోడా ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతుంది.
అలాగే ఆల్కహాల్ పానీయాలు తక్కువ పోషకాలు, ఎక్కువ క్యాలరీలను కూడా కలిగి ఉంటాయి. మరి దీంతోపాటు చిప్స్, ఇతర రుచికరమైన స్నాక్స్, తీసుకోవడం వల్ల మొత్తం గ్యాలరీల సంఖ్య మరింత పెరుగుతుంది. అలాగే కాఫీ టీ వంటి కెఫిన్ అధికంగా ఉండే డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. టీ కాఫీలలో అధిక కెఫిన్ తో పాటు ఇతర ఉద్దీపనలు హృదయ స్పందన రేటు, రక్తపోటులను వచ్చేలా చేస్తాయి. డ్రింక్స్ కూడా చక్కెరకు అవసరమైన క్యాలరీతో నిండి ఉంటాయి.