Health Tips : ఈ పండ్లు తీసుకుంటే అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!!
Health Tips : ప్రస్తుతం మనం ఉన్న కాలంలో చాలామందికి ఎన్నో ఆరోగ్య సమస్యలు రావడంతో వారు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు.. అయితే ఇప్పుడున్న కాలంలో మన ఆరోగ్యం గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే మొదటిగా సమస్యలు ఎదుర్కొనేవి మనం మూత్రపిండాలే. మానవ శరీరంలో అతి ముఖ్యమైన మూత్రపిండాలు శరీరంలోని వ్యర్ధాలను విష పదార్థాలను బయటికి పంపించడానికి సహాయపడేవి మూత్రపిండాలు. శరీర ఆరోగ్య దానిపై ఆధారపడి ఉంటుంది. వీటి విషయంలో ఏమాత్రం అజాగ్రత్త చేయకూడదు.
అయితే మన మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బ తినడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రధానంగా షుగర్, అధిక రక్తపోటు లాంటి అనేక రకాల మార్పుల వలన కలిగే వ్యాధులే కిడ్నీల పనితీరును ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కిడ్నీల వ్యాధులను తగ్గించడానికి ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఉప్పును చాలా వరకు తగ్గించుకోవాలి. అదేవిధంగా నీటిని పుష్కలంగా తీసుకోవాలి. వీటిని తప్పకుండా పాటిస్తే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీల ఆరోగ్యం కోసం కోలాలతో సహా కృత్రిమ శీతల పానీయాలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. అదేవిధంగా తీపి పదార్థాలను అతిగా తీసుకోకూడదు. శాఖాహారాలను ఎక్కువగా తీసుకోవాలి.
అదే విధంగా కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వలన అవి మన మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే ఈ పండ్లలో వీటిని ఎక్కువగా తీసుకోవాలి. అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ పండ్లు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం.. ద్రాక్ష : దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడతాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తపోటు గుండె జబ్బులను కూడా తగ్గించడానికి ఈ పండు చాలా ఉపయోగపడుతుంది. అనాస పండు : అనాస పండుని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉండే పైనాపిల్ కిడ్నీల ఆరోగ్య సమస్యలను చెక్ పెడుతుంది.
నారింజ : నారింజతో సహా సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు మన కిడ్నీలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆపిల్ : ఆపిల్ పండులలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇలాంటి పండు రోజు ఒకటి తింటే అనారోగ్య సమస్యలు అంటూ రావు. ప్రధానంగా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. క్యాల్షియం విటమిన్ బి పుష్కలంగా ఉండే ఆపిల్స్ గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. స్ట్రాబెరీస్ : బ్లూబెర్రీస్ స్ట్రాబెరిస్ లాంటి బెర్రీలను మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ బెర్రీలలో కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచి విటమిన్ సి ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఈ బేర్రీలను కిడ్నీ స్టోన్ ఏర్పడే ప్రమాదం నుంచి బయటపడేస్తుంది..