Tea and Coffe : ప్రతిరోజు3 కప్పుల కన్నా ఎక్కువ టీ, కాఫీలు తాగుతున్నారా…? అయితే ఈ ప్రమాదంలో పడినట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tea and Coffe : ప్రతిరోజు3 కప్పుల కన్నా ఎక్కువ టీ, కాఫీలు తాగుతున్నారా…? అయితే ఈ ప్రమాదంలో పడినట్లే…!

Tea and Coffe : మనలో చాలామంది ఉదయం లేచిన వెంటనే టీ ,కాఫీలు తాగకపోతే వారు ఎటువంటి పని మొదలు పెట్టరు.. లేచిన వెంటనే ఒక కప్పు కాఫీ తాగితే వారికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది.. టీ ,కాఫీలలో కేఫిన్ అనే పదార్థం ఉండడం వల్ల శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది.. అయితే ఈ టీ ని కొంతమంది కప్పుల మీద కప్పులు తాగేస్తూ ఉంటారు.. అయితే ఇలా తాగితే ఆరోగ్యానికి ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు.. […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 February 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Tea and Coffe : ప్రతిరోజు3 కప్పుల కన్నా ఎక్కువ టీ, కాఫీలు తాగుతున్నారా...? అయితే ఈ ప్రమాదంలో పడినట్లే...!

Tea and Coffe : మనలో చాలామంది ఉదయం లేచిన వెంటనే టీ ,కాఫీలు తాగకపోతే వారు ఎటువంటి పని మొదలు పెట్టరు.. లేచిన వెంటనే ఒక కప్పు కాఫీ తాగితే వారికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది.. టీ ,కాఫీలలో కేఫిన్ అనే పదార్థం ఉండడం వల్ల శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది.. అయితే ఈ టీ ని కొంతమంది కప్పుల మీద కప్పులు తాగేస్తూ ఉంటారు.. అయితే ఇలా తాగితే ఆరోగ్యానికి ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు.. దీనిలో ఉండే కేఫిన్ బ్రెయిన్ పై ఎఫెక్ట్ పడుతుందని కేఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల తొందరగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు సూచన..
కాఫీ ఎక్కువగా తాగడం వలన కడుపులో పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది.

బీపీని పెంచడమే కాకుండా కొన్నిసార్లు గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కాల్షియం గ్రహించే సామర్థ్యాన్ని కాపీ తక్కువ చేస్తుంది. అధికంగా కాఫీ తీసుకోవడం వలన రొమ్ములో చిన్న చిన్న గడ్డలు వస్తాయి. కాఫీ వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది. ఇది ఆరోగ్యానికి జుట్టుకి, చర్మానికి హాని కలిగిస్తుంది.. ఎక్కువ మోతాదులో టీ, కాఫీలు తీసుకోవడం వలన ఏకాగ్రతను ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఉదర సమస్య లు: కాఫీ ఎక్కువగా తాగడం వలన ఉదర సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. కొంతమందికి తరచుగా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ బాత్రూం కి వెళ్తూ ఉంటారు. అలాగే డయేరియా లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

నిద్రలేమి సమస్య: కాఫీ టీలు తాగిన తర్వాత చాలామందికి నిద్ర రాదు. అటువంటివారు కాఫీకి పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. కాఫీ అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. డిప్రెషన్: కాఫీ అధికంగా తీసుకోవడం వలన డిప్రెషన్ కి లోనవుతారు. మానసిక ఆరోగ్యం ఒత్తిడితో ఇబ్బంది పడేవారు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల ఒత్తిడి నుంచి బయట పడవచ్చు.. కానీ ఒత్తిడి నుంచి బయటపడడం కోసం పదేపదే కాఫీ తాగినట్లయితే ఇంకా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ రిస్క్ ఎక్కువవుతుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది