Eye Sight : కంటి చూపు ఎంత భయంకరంగా పెరుగుతుందంటే మీ కళ్ళజోడు ని తీసి పక్కన పడేస్తారు ..!!
Eye Sight : కళ్ళు అనేవి మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు. ఇవి లేకపోతే మనం ఏమీ చూడలేం, ఏమి చేయలేం కాబట్టి కంటి చూపు తగ్గకుండా, అంధత్వం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి మందులు వాడకుండా ఆపరేషన్ జోలికి పోకుండా ఇంట్లోనే ఈజీగా దొరికే పదార్థాలతో కంటి చూపును మెరుగు పరిచే అద్భుతమైన రెమిడి ఉంది. దీనిని కనుక ప్రతిరోజు చేసుకున్నారంటే కంటి సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. అలాగే జీవితంలో కంటి సమస్యలు అనేవి అస్సలు రావు. ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా ఈ రెమెడీను తయారు చేసుకోవచ్చు.
మసకగా కనిపించడం, కళ్ళు నీరు కారడం, తలనొప్పి, ఏ వస్తువు చూసిన డబల్ గా కనిపించడం, వెలుతురు అసలు చూడలేకపోవడం, మెడ, భుజాలు, వీపు నొప్పిగా ఉండడం ఇవన్నీ కూడా కళ్ళ సంబంధిత వ్యాధులు. అందుకే ముందుగా మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. కళ్ళు పొడిబారకుండా ఉండడానికి తగినన్ని నీళ్లు తీసుకుంటూ ఉండాలి. కళ్ళ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండడానికి విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.
బొప్పాయి, క్యారెట్, పాలకూర , మెంతికూర వంటి వాటిల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది. ఎటువంటి కంటి సంబంధిత వ్యాధులు దరిచేరవు. కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారు అయిదు మిరియాలను తీసుకొని మెత్తగా పొడి లాగా చేసుకొని ఒక బౌల్లో వేసుకొని అర స్పూన్ స్పటిక బెల్లం, ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసి బాగా కలిపాలి. ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున ఒక స్పూన్ తీసుకోవాలి. దీన్ని తిన్న తర్వాత గంట వరకు ఏమీ తినకూడదు. ఇలా చేస్తే కంటి సంబంధిత సమస్యలు జీవితంలో దరిచేరవు.