Eggs : కోడిగుడ్డు విషయంలో ఉన్న అపోహాలు ఏమిటి … వాటి వెనకున్న అసలు నిజాలు ఏమిటి…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Eggs : కోడిగుడ్డు విషయంలో ఉన్న అపోహాలు ఏమిటి … వాటి వెనకున్న అసలు నిజాలు ఏమిటి…??

Eggs : కోడి గుడ్డు మన ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో ఎన్నో రకాల పోషక గుణాలు మరియు శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు ఉన్నాయి. అందుకే ప్రతిరోజు కోడిగుడ్డును తినాలి అని వైద్యులు ఎప్పుడు చెబుతూ ఉంటారు. చివరికి నాన్ వెజ్ తినని వారు కూడా కోడిగుడ్డును మాత్రం తింటారు. అయితే మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే కోడిగుడ్డు విషయంలో కొన్ని అపోహాలు ఉన్నాయి. అయితే అలాంటి […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 October 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Eggs : కోడిగుడ్డు విషయంలో ఉన్న అపోహాలు ఏమిటి ... వాటి వెనకున్న అసలు నిజాలు ఏమిటి...??

Eggs : కోడి గుడ్డు మన ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో ఎన్నో రకాల పోషక గుణాలు మరియు శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు ఉన్నాయి. అందుకే ప్రతిరోజు కోడిగుడ్డును తినాలి అని వైద్యులు ఎప్పుడు చెబుతూ ఉంటారు. చివరికి నాన్ వెజ్ తినని వారు కూడా కోడిగుడ్డును మాత్రం తింటారు. అయితే మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే కోడిగుడ్డు విషయంలో కొన్ని అపోహాలు ఉన్నాయి. అయితే అలాంటి కొన్ని అపోహాలు ఏమిటి.? వాటిలో నిజం ఎంత ఉన్నది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

– కోడిగుడ్డును తినడం వలన మన శరీరంలో కొవ్వు పెరుగుతుంది అనే సందేహం చాలా మందికి ఉన్నది. అయితే నిజం చెప్పాలంటే దీనిలో కొవ్వు అనేది ఏ మాత్రం లేదు అని, అది కేవలం అపోహ మాత్రమే అని అంటున్నారు నిపుణులు. అలాగే మనం కోడిగుడ్డును తీసుకోవటం వలన బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయిలపై పడే చెడు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది అని కొన్ని అధ్యానంలో కూడా తేలింది…

– ఇకపోతే కోడిగుడ్డు ను ఉడకబెట్టే ముందు వాటిని కడిగే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ కోడిగుడ్డులను కడగకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని కొంతమంది భావిస్తారు. అయితే దీనిలో కూడా ఏమాత్రం నిజం లేదు. నిజం చెప్పాలంటే కోడిగుడ్లను కడిగితేనే ఎక్కువ ప్రమాదం అని అంటున్నారు నిపుణులు. అయితే కోడిగుడ్లను కడగటం వలన కోడిగుడ్డు పొట్టు పై ఉండే నేచురల్ ప్రొటెక్టివ్ కోటింగ్ అనేది పోతుంది.

-అలాగే ప్రతిరోజు కోడిగుడ్డును తినడం వలన కూడా ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది అని భావించే వారు కూడా ఉన్నారు. కానీ ఇందులో కూడా ఇటువంటి నిజం లేదు. అయితే రోజుకు రెండు కోడిగుడ్లను ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు. అయితే ఇంతకి మించి ఎక్కువ గుడ్లను తీసుకుంటే మాత్రం జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు నిపుణులు

– ఇకపోతే కోడిగుడ్డులోని పచ్చ సోన ను తీసుకుంటే బరువు పెరుగుతారని కొంతమంది భావిస్తారు. కానీ దీనిలో కూడా ఇటువంటి నిజం లేదు. అలాగే ఈ పచ్చ సోనాలో విటమిన్ ఏ డి మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి.

Eggs కోడిగుడ్డు విషయంలో ఉన్న అపోహాలు ఏమిటి వాటి వెనకున్న అసలు నిజాలు ఏమిటి

Eggs : కోడిగుడ్డు విషయంలో ఉన్న అపోహాలు ఏమిటి … వాటి వెనకున్న అసలు నిజాలు ఏమిటి…??

– తెల్ల గుడ్డుతో పోల్చితే గోధుమ రంగులో ఉండే గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కొంతమంది భావిస్తారు. అయితే దీనిలో కూడా ఏమాత్రం నిజం లేదు. ఈ రెండు కోడిగుడ్లలో ఒకే రకమైన పోషకాలు ఉంటాయి అని అంటున్నారు నిపుణులు. కాకపోతే ఊరి కోడి గుడ్డలో ఎక్కువ పోషకాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది