Digestion Problems : గ్యాస్ నొప్పికి తక్షణమే ఉపశమనం… ఈ చిట్కాతో అద్భుత ఫలితాలు….!
Digestion Problems : నేటి కాలంలో చాలామంది రెస్టారెంట్లు మరియు రోడ్ సైడ్ హోటలలో బిర్యానీలు స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. అందులో అధిక మొత్తంలో మసాలాలు వాడుతారు. వీటి కారణంగా గ్యాస్ సమస్యలు మరియు అజీర్ణం అంటే సమస్యలను తెచ్చుకుంటున్నారు. దీని కారణంగా కడుపు నొప్పి గ్యాస్ అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటి నుండి ఉపశమనం పొందేందుకు కొంతమంది వైద్యుల దగ్గరికి వెళ్లి మందులు తీసుకుంటారు. మరి కొందరు కొన్ని కూల్ డ్రింకులు తాగి ఉపశమనం పొందుతారు. కానీ ఇలా తరచూ మందులు కూల్ డ్రింక్స్ తీసుకోవడం శరీరానికి మంచిది కాదు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ రకమైన అజీర్ణం గ్యాస్ సమస్యల నుంచి ఇంట్లోనే ఉపశమనం పొందవచ్చు. దీనితో విముక్తి కలుగుతుంది. ఇలా చేయడం వలన ప్రతిసారి మందులు తీసుకోవాల్సిన అవసరం రాదు.
Digestion Problems : పెరుగు
గ్యాస్ నొప్పి తగ్గించడానికి పెరుగులో జీలకర్ర పొడి ఉప్పు తగ్గినంత వేసి నీళ్లు కలిపి తీసుకున్నట్లయితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. పొట్టను చల్ల పరచడంలో పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Digestion Problems సోంపు
పొట్టను చల్లగా ఉంచేందుకు పెరుగుతో పాటుు నానబెట్టిన సోంపు నీరు కూడా సహాయపడుతుంది. అజీర్ణంగా ఉన్నప్పుడు వన్ టీ స్పూన్ సోంపుని నానబెట్టి ఆ నీటిని తాగాలి. దీని వల్ల అజీర్ణం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. సోంపులో ఉండే కొన్ని పదార్థాలు గ్యాస్ ని పీల్చుకుంటాయి.
Digestion Problems లవంగాలు
లవంగాలు గ్యాస్ నొప్పిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఒక గ్లాస్ నీటిలో మూడు లవంగాలు వేసుకొని ఆ నీటిని తాగడం ద్వారా గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.