Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఏర్పరిచే ఆహారాలు ఇవే.. వీటికి దూరంగా ఉండండి..!
ప్రధానాంశాలు:
Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఏర్పరిచే ఆహారాలు ఇవే.. వీటికి దూరంగా ఉండండి..!
Kidney Stones : మన బాడీలో కిడ్నీలో అత్యంత కీలకం. కిడ్నీలు లేకపోతే మనం జీవించలేం. ఎందుకంటే కిడ్నీలు మన బాడీలోని చెడు పదార్థాలను ఫిల్టర్ చేయడంలో అత్యంత కీలకంగా పని చేస్తాయి. ఒకవేళ కిడ్నీల్లో ఏదైనా సమస్య వస్తే మాత్రం బాడీ మొత్తం కుప్పకూలిపోతుంది. అందుకే కిడ్నీల ఆరోగ్యం మనకు అత్యంత కీలకం. అయితే ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అందులోనూ కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. చిన్న వయసు వారిలో కూడా ఇది బాగానే కనిపిస్తోంది.
Kidney Stones రూట్ వెజిటేబుల్స్ వద్దు..
కొందరు ఇప్పుడు ఫాలో అయ్యే డైట్ కూడా కిడ్నీల్లో రాళ్లు తయారవడానికి కారణం అవుతోంది. అయితే ఎక్కువగా వాటర్ తాగడం వల్ల కిడ్నీలు ఎప్పటికప్పుడు ఫిల్టర్ అవుతుంటాయి. కానీ ఈ రోజుల్లో చాలా మంది నీళ్లు తక్కువగా తాగుతున్నారు. అందుకే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. దాంతో పాటు ఈ రోజుల్లో తినే తిండి కూడా కిడ్నీల్లో రాళ్లకు కారనం అవుతుంది. ఎక్కువగా రూట్ వెజిటేబుల్స్ తినొద్దని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఆక్సలేట్స్ ఉంటాయి. వాటి వల్ల కిడ్నీళ్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన పండ్ల రసాలను బాగా తాగుతున్నారు. అవి తాగినా సరే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో చెడు దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఇక శీతల పానీయాల్లో ఎక్కువగా షుగర్ ఉంటుంది. కాబట్టి ఇది మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది. ఇక ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ను తింటున్నారు. అది కూడా అస్సలు మంచిది కాదు. ఫాస్ట్ ఫుడ్ కు ఎంత దూరం ఉంటే అంత బెటర్ అని చెబుతున్నారు డాక్టర్లు.
వేయించిన ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. దాంతో పాటు ఉప్పును అస్సలు తినొద్దు. ఎందుకంటే ఉప్పు వల్ల రక్తహీనత, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయి. ఉప్పు ఎక్కువగా తింటే కచ్చితంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. ఇక రోజులో రెండు సార్ల కంటే ఎక్కువ టీ, కాఫీలు తాగినా సరే రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.