Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ ప్రత్యేకమైన బియ్యం గొప్ప వరం… పుష్కలంగా ఆరోగ్య ఉపయోగాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ ప్రత్యేకమైన బియ్యం గొప్ప వరం… పుష్కలంగా ఆరోగ్య ఉపయోగాలు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :1 May 2023,7:00 am

Diabetes : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో చాలామంది షుగర్ వ్యాధితో ఇబ్బంది పడటం మనం చూస్తూనే ఉన్నాం. మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులను ఎక్కువగా వైట్ రైస్ తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు. దీనిలో స్టార్చ్ కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. కావున వైట్ రైస్ ను అధికంగా తీసుకోకూడదని చెప్తారు ఇది షుగర్ రోగులకు అస్సలు మంచిది కాదు. టైప్ టు డయాబెటిస్ రోగులు తక్కువ అన్నం తినడానికి ముఖ్య కారణం కూడా ఇదే. అయితే మధుమేహ బాధితులకు మరో మార్గం లేదని సహజంగా పండించిన బియ్యం ఆరోగ్యానికి అంత ప్రమాదకరం కాదన్నారు.

This special rice is a great boon for Diabetes

This special rice is a great boon for Diabetes

అయితే వరి నుండి బియ్యాన్ని తీయడానికి దాన్ని రైస్ మిల్లులకు పంపించి ఆపై తెల్లగా పాలిష్ వేస్తూ ఉంటారు. అయితే ఈ విధానం సహజంగా పండించిన బియ్యం పోషకేల్వలను తగ్గించేలా చేస్తుంది. బియ్యం పాలిష్ వేయడం వలన దాంట్లోని విటమిన్ బి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని గ్లైసోమిక్ సూచిక కూడా పెరుగుతుంది. దీని మూలంగా గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రస్తుతం మనం ఉన్న కాలంలో ఆరోగ్యాన్ని మరింత హాని కలిగించే కల్తీ బియ్యం కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. అయితే మధుమేహ రోగులు ఏ రైస్ తీసుకోవాలి. టైప్ టు షుగర్ వ్యాధిగ్రస్తులు వైట్ రైస్ వైట్ రైస్ తో చేసిన అన్నం పదార్థాలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

This special rice is a great boon for Diabetes

This special rice is a great boon for Diabetes

అయితే వారికి బ్రౌన్ రైస్ రూపంలో మంచి ఎంపిక ఉంటుంది. బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో ఎక్కువ పోషకాలు ఎక్కువ ఫైబర్ ఎక్కువ విటమిన్లు తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ స్కోర్ లు అనేవి ఉంటాయి. ఏ రైస్ అత్యల్ప జీవన్ స్కూల్ కలిగి ఉంటుంది. వైట్ రైస్ లోని గ్లైసోమిక్ ఇండెక్స్ స్కోర్ 70% ఉంటుంది. అంటే టైప్ టు షుగర్ ఉన్నవారికి ఇది చాలా డేంజర్.. బాస్మతి రైస్ జీవన్ స్కోరు 56 నుండి 69 వరకు ఉంటుంది. అయితే ఇది వైట్ రైస్ అంతకంటే ఎక్కువ ఉండదు. ఇంకొక వైపు బ్రౌన్ రైస్ విషయానికొస్తే దాని G1 స్కోరు 50కి దగ్గరలో ఉంటుంది. కావున చాలామంది ఆరోగ్య నిపుణులు దీనిని తీసుకోవాలని చెప్తున్నారు. కావున షుగర్ వ్యాధిగ్రస్తులు బ్రౌన్ రైస్ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది