Hair Tips : జుట్టు బాగా తెల్ల బడిందా… అయితే ఒకసారి ఈ చిట్కాను పాటించండి…!
Hair Tips : ప్రస్తుతం చాలామంది వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు తెల్ల వెంట్రుకల సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, పనిలో ఒత్తిడి, ఆందోళన ఇలా ఎన్నో కారణాల వలన తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. అతి చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు రావడం వలన కొందరు బయటికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. దీనికోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రోడక్ట్లను ఉపయోగిస్తున్నారు. వీటిలో అనేక రకాల కెమికల్స్ ఉండడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎటువంటి కెమికల్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉన్న పదార్థాలతోనే జుట్టును న్యాచురల్ గా నల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేసిన తర్వాత మీకు తెల్ల వెంట్రుకలు అస్సలు కనిపించవు.
ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా జుట్టుకు సరిపడా కరివేపాకులు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి. తర్వాత స్టవ్ పై ఇనుప కడాయి పెట్టుకొని అందులో కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. నూనె వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు నల్లగా మాడేంతవరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని జల్లడ పట్టుకోవాలి.వచ్చిన పొడిని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు అందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తలస్నానం చేసి జుట్టు కుదుర్ల నుంచి చివర్ల దాకా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత గంట వరకు ఆరనిచ్చి గట్టిగా ఆరిపోకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడే నీటితో కడిగేసుకోవాలి. అప్లై చేసిన రోజు షాంపు ఉపయోగించకూడదు. తర్వాతి రోజు షాంపును వాడవచ్చు. ఇలా వారానికి ఒకసారి నెలపాటు చేయడం వలన తెల్ల వెంట్రుకలు పోయి జుట్టు నల్లగా మారుతుంది. ఈ చిట్కాను వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించబడలేదు. కాబట్టి దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ చిట్కాను ట్రై చేసిన తర్వాత అస్సలు తెల్ల వెంట్రుకలు కనిపించవు. మీరు కూడా ఒకసారి ఈ చిట్కాను ట్రై చేశారంటే ఫలితాన్ని చూసే మీరే ఆశ్చర్యపోతారు.