Weight loss : శ్రమ లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా… ఇలా చేయండి…!!
Weight loss : ప్రస్తుత కాలంలో ఎంతో మందిని వేధిస్తున్న సమస్యలలో ఊబకాయం కూడా ఒకటి. ఇది మధుమేహం, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెకు సంబంధించిన ప్రమాదాలను కూడా పెంచే అవకాశం ఉంది. అయితే బరువు పెరగడాన్ని తగ్గించుకునేందుకు ప్రజలు జిమ్ లో గంటల తరబడి శ్రమిస్తారు. అలాగే డైట్ పేరుతో సగం ఆహారాన్ని తీసుకుంటున్నారు. అయితే దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు. మీరు భోజనం మానేయడం మరియు డైటింగ్ చేయడం వలన ఈజీగా బరువు […]
Weight loss : ప్రస్తుత కాలంలో ఎంతో మందిని వేధిస్తున్న సమస్యలలో ఊబకాయం కూడా ఒకటి. ఇది మధుమేహం, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెకు సంబంధించిన ప్రమాదాలను కూడా పెంచే అవకాశం ఉంది. అయితే బరువు పెరగడాన్ని తగ్గించుకునేందుకు ప్రజలు జిమ్ లో గంటల తరబడి శ్రమిస్తారు. అలాగే డైట్ పేరుతో సగం ఆహారాన్ని తీసుకుంటున్నారు. అయితే దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు. మీరు భోజనం మానేయడం మరియు డైటింగ్ చేయడం వలన ఈజీగా బరువు తగ్గొచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం తీసుకుంటున్నా ఆహారం మరియు జీవనశైలిలో మార్పుల వలన ఈజీగా బరువు తగ్గుతారు అని నిపుణులు అంటున్నారు. అయితే మీరు బరువు తగ్గాలి అనుకున్నట్లయితే రాత్రి 7 గంటల లోపు అన్నం తీసుకోవటం అలవాటు చేసుకోండి. అలాగే రాత్రి భోజనానికి మరియు నిద్రకు మధ్య మూడు గంటల టైం ఉండాలి అని నిపుణులు అంటున్నారు…
రాత్రిపూట భోజనం తినడం వలన ఆహారం అనేది తొందరగా జీర్ణం కాదు. దీనివలన జీవక్రియ ఎంతో ప్రభావితం అవుతుంది. దీంతో శరీరంలో కొవ్వు అనేది వేగంగా పెరుగుతుంది. కావున మీరు బరువు తగ్గాలి అని అనుకున్నట్లయితే సాయంత్రం టైమ్ లో తొందరగా ఆహారం తీసుకోవటం అలవాటు చేసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే రాత్రిపూట ఎప్పుడు కూడా లైట్ ఫుడ్ ను తీసుకోవడం మంచిది అని అంటున్నారు. అయితే బరువు తగ్గటానికి మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ మరియు ఐరన్ అధికంగా ఉండే వాటిని తీసుకోవటం మంచిది అని అంటున్నారు. మీరు రాత్రి టైం లో పచ్చి కూరగాయలు, సూప్, సలాడ్, పప్పు లాంటివి తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అర్ధరాత్రి ఆకలిగా అనిపించినట్లయితే కీర దోసకాయ లేక యాపిల్ పండ్లు లాంటివి తినవచ్చు. మనం తొందరగా నిద్రపోవటం వలన మెలటోనిన్ అనే హార్మోన్ శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ ను సృష్టించి కేలరీలను బర్న్ చేయడంలో మేలు చేస్తుంది అని నిపుణులు అంటున్నారు. మీరు రాత్రి టైంలో బాగా నిద్రపోవటం వలన శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఇది ఎంతో వేగంగా బరువు తగ్గేందుకు మేలు చేస్తుంది…
ఊబకాయం అనేది నిద్రను కూడా ప్రభావితం చేయగలదు. అయితే మీరు బరువు తగ్గటానికి కనీసం 7 గంటల నిద్ర చాలా ముఖ్యం. మీకు సరైన నిద్ర అనేది లేకపోతే, అది మీ జీవక్రియను నెమ్మదిస్తుంది. దీని వలన మీరు బరువు తగ్గటానికి ఎంతో కష్టం అవుతుంది. ఇక నుంచి మీరు మంచి నిద్ర కోసం రాత్రి పడుకునే టైమ్ లో పసుపు పాలను తాగటం అలవాటు చేసుకోండి. ఈ పసుపు పాలు అనేవి బరువు తగ్గించడానికి మరియు మంచి నిద్రకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ పసుపులో కొవ్వును కాల్చేందుకు సహాయపడే థర్మోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. దీంతోపాటు జీవ క్రియను కూడా ఎంతగానో పెంచుతుంది. కావున ప్రతినిత్యం పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలను తాగటం అలవాటు చేసుకోండి…