Glycemic Index : ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ అని ఉంటాయి. టైప్ 1 డయాబెటిస్ వంశ పారంపర్యంగా వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల వస్తుంది. అయితే ఏ డయాబెటిస్ ఉన్నవారు అయినా సరే తమ ఆహారంలో తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
సాధారణంగా మనం తినే ఆహారాల్లో ఉండే కార్బొహైడ్రేట్లు (పిండి పదార్ధాలు) మన శరీరంలో గ్లూకోజ్‌గా మారుతాయి. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ఎక్కువైతే ఆ స్థితిని డయాబెటిస్ అంటారు. అయితే మనం తినే ఆహార పదార్థాలను బట్టి వాటిల్లో పిండి పదార్థాల శాతం ఎక్కువగా, తక్కువగా ఉంటుంది. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వెంటనే పెరుగుతాయి. వీటినే హై గ్లైసీమిక్ ఇండెక్స్ పదార్థాలు అంటారు. వీటిని డయాబెటిస్ ఉన్నవారు తినరాదు. మనం తినే ఆహారాల వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే శాతాన్ని గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు. దీనికి ఒక విలువ ఇస్తారు. అంటే ఒక్కో పదార్థానికి ఒక్కో జీఐ విలువ ఉంటుంది. జీఐ విలువ ఎక్కువగా ఉందంటే.. ఆ పదార్థాన్ని తిన్న వెంటనే మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వెంటనే పెరుగుతాయని అర్థం. కనుక డయాబెటిస్ ఉన్న వారు జీఐ విలువ ఎక్కువగా ఉండే ఆహారాలను అస్సలు తినరాదు.
ఇక జీఐ విలువ మధ్యస్థంగా ఉండే ఆహారాలను తక్కువ మోతాదులో డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవచ్చు. అదే జీఐ విలువ చాలా తక్కువగా ఉండే ఆహారాలను అయితే వారు నిత్యం తీసుకోవచ్చు. ఆ పదార్థాల వల్ల షుగర్ లెవల్స్ పెరగవు కనుక వాటిని నిత్యం తీసుకోవచ్చు.
జీఐ విలువ 70 అంతకన్నా ఎక్కువగా ఉంటే వాటిని అధిక జీఐ కలిగిన ఆహారాలని అంటారు. 56 నుంచి 69 మధ్య జీఐ విలువ ఉంటే ఆ పదార్థాలను మధ్యస్థ జీఐ విలువ కలిగిన ఆహారాలని, అదే 55 అంతకన్నా తక్కువగా జీఐ విలువ ఉంటే వాటిని తక్కువ జీఐ విలువ కలిగిన ఆహారాలని పిలుస్తారు. కనుక డయాబెటిస్ ఉన్నవారు జీఐ విలువ 55 అంతకన్నా తక్కువ కలిగిన ఆహారాలనే తినాల్సి ఉంటుంది. వాటి వల్ల చక్కెర స్థాయిలు పెరగవు. కనుక డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
ఇక జీఐ విలువ అనేది కేవలం పిండి పదార్థాలు ఉండే పదార్థాలకే వర్తిస్తుంది. ప్రోటీన్లు, కొవ్వులు మాత్రమే ఉండే ఆహారాలకు జీఐ విలువ ఉండదు. ఉదాహరణకు బీఫ్, చికెన్, చేపలు, గుడ్లు, మూలికలు, మసాలాల్లో పిండి పదార్థాలు ఉండవు. లేదా చాలా సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి. అందువల్ల వీటికి జీఐ విలువ ఉండదు.
గోధుమలు, బార్లీ, చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, పాలు, పెరుగు, బాదం పాలు, సోయా పాలు తదితర ఆహారాల్లో జీఐ విలువ తక్కువగా ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు వీటిని నిత్యం తీసుకోవచ్చు. అలాగే నట్స్, ఆలివ్ ఆయిల్, వెన్న, అవకాడో, వెల్లుల్లి, తులసి, మిరియాలు, అల్లం వంటి వాటిని కూడా తీసుకోవచ్చు.
తెల్ల బ్రెడ్, అన్నం, పాస్తా, నూడుల్స్, పుచ్చకాయలు, చిప్స్, కేకులు, కుకీస్, బిస్కెట్లు, ఇతర బేకరీ పదార్థాలు, జంక్ ఫుడ్స్, తియ్యని పదార్థాలు ఎక్కువ జీఐ విలువను కలిగి ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వాటిని తినరాదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.