Aquarius Horoscope : మార్చి 8 మహాశివరాత్రి తర్వాత కుంభ రాశి వారు నక్క తోక తొక్కినట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Aquarius Horoscope : మార్చి 8 మహాశివరాత్రి తర్వాత కుంభ రాశి వారు నక్క తోక తొక్కినట్లే…!

Aquarius Horoscope : శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాసి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని దేవుడు. కుంభరాశిని స్థిరరాశి అని పిలుస్తుంటారు. అయితే ఈ రాశి వారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష కార్య దక్షత అత్యధికం మంచి చెడులు ఆలోచించిన తర్వాతే ఒక పనిని ప్రారంభించడం జరుగుతుంది. వీళ్ళకి అతీంద్రియ విద్యపై కూడా ఎక్కువగా […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 March 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Aquarius Horoscope : మార్చి 8 మహాశివరాత్రి తర్వాత కుంభ రాశి వారు నక్క తోక తొక్కినట్లే...!

Aquarius Horoscope : శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాసి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని దేవుడు. కుంభరాశిని స్థిరరాశి అని పిలుస్తుంటారు. అయితే ఈ రాశి వారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష కార్య దక్షత అత్యధికం మంచి చెడులు ఆలోచించిన తర్వాతే ఒక పనిని ప్రారంభించడం జరుగుతుంది. వీళ్ళకి అతీంద్రియ విద్యపై కూడా ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. అలాగే మీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా నే చేస్తారు. అందువల్ల ప్రతి విషయంలోనూ ప్రతి వ్యవహారంలోనూ ఒక కీలకమైనటువంటి అవగాహనని కలిగి ఉంటారు. అదే విధంగా ఒక పని మీద వీరు ఎలాంటి ఆశ లేకుండా పూర్తి చేయడం జరుగుతుంది. ఇక ఈ రాశి వారు ఎంతో సున్నితమైన స్వభావులు కనుక చిన్న మాటన్నా కూడా నచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వరమైన నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు చిక్కుల్లో పడేటటువంటి సమస్య ప్రమాదం ఉంటుంది. అటువంటి ఈ కుంభ రాశి వారికి మార్చి 8వ తేదీన మహాశివరాత్రి ఆ తర్వాత నుంచి కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.

ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మహాశివరాత్రి తర్వాత నుంచి విపరీతమైన అదృష్టం దక్కబోతోంది. వీరికి ఎన్నో మేలైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధిస్తారు. ఇది మాత్రమే కాదు.. కచ్చితంగా ఈ రాశి వారికి చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. ప్రత్యేకంగా ఒక వ్యవహారంలో మాత్రం శుభ ఫలితాన్ని అందుకుంటారు. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా నెరవేరుస్తారు. ఎందుకంటే ఈ సమయం కుంభరాశి వారికి చాలా ముంచి కాలమని చెప్పొచ్చు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడం చిన్నపాటి సమస్యలు ఉన్న అంతిమ విజయం సాధిస్తారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. కచ్చితంగా ఈ సమయంలో మాత్రం బద్దకాతో ఉండకండి.. నూతన ఆలోచనలతో ముందుకు సాగిపోయి అభివృద్ధి సాధిస్తారు. క్రమంగా పైకి వస్తారో ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. తోటి వారితో కలిసి చేసే పనులు త్వరగా ఫలిస్తాయి. ఆసక్తి తగ్గడం ఇలాంటివి మీ దగ్గరికి రానివ్వదు. ఎక్కువగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి అనే ఆలోచన మీరు ఎక్కువగా ఉండనివ్వాలి. అదే విధంగా మీకు విదేశాలకు వెళ్లాలి అనుకునేటటువంటి వారు మీరు చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఆపొద్దు. ఒకవేళ మీరు ఆ పనుల్లో నిరాశను ఎదురైనట్లయితే కచ్చితంగా ఈ సమయంలో ఇంకొక్కసారి ప్రయత్నించండి. మీకు కచ్చితంగా మీకు దక్కిన ఈ అదృష్టానికి తోడుగా మీ ప్రయత్నం కచ్చితంగా సక్సెస్ అవుతుంది.

మరి ఇంకా ఈ రాశి వారు ప్రస్తుత కాలంలో చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైన పరిహారాలు ఉంటాయండి. అయితే ఆ పరిహారాలు ఏంటి అంటే కుంభ రాశి వారికి ఎక్కువగా శని బుధ మహర్దశలో ఈ సమయంలో బాగా యోగిస్తున్నాయి. అయితే పడమర దక్షిణ ఉత్తర దిశలో బాగా యోగిస్తున్నాయి. మీకు ఏది ఎక్కువ కూడా దోషం కాదు. రాజరాజేశ్వరి అష్టక పారాయణము అనేది ఈ సమయంలో చాలా మంచిది. గణపతికి తల్లిని పూలతో పూజ చేయండి. చాలా మంచి జరుగుతుంది. అదృష్టానికి దగ్గరగా మీ జీవితం నడుస్తుంది. కాబట్టి మీరు చేపట్టే ప్రతి ఒక్క పని కూడా విజయవంతం అవుతుంది. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా ఈ సమయంలో నలుగురికి సాయపడవలసినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా మీరు నిత్యం శని దేవుడు పూజించండి. మంగళవారం, బుధవారం చవితి రోజుల్లో గణేష్ని మంత్రాలు స్తోత్రాలు పట్టించండి. గణపతిని మీరు భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల చక్కని అదృష్టం అనేది మీకు దక్కుతుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది