Venu Swamy : వేణు స్వామి ఉగాది పంచాంగం…ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం…!
Venu Swamy : క్రోధీనామ సంవత్సరంలో భాగంగా జ్యోతిష్య పండితులు వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో భాగంగా రాశి ఫలాల గురించి తెలియజేయడం జరిగింది. వేణు స్వామి తెలిపిన రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. Venu Swamy : మేష రాశి… ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా తలచిన కార్యాలు అన్నీ కూడా నెరవేరగలవు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విద్యారంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. Venu Swamy : […]
ప్రధానాంశాలు:
Venu Swamy : వేణు స్వామి ఉగాది పంచాంగం...ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం...!
Venu Swamy : క్రోధీనామ సంవత్సరంలో భాగంగా జ్యోతిష్య పండితులు వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో భాగంగా రాశి ఫలాల గురించి తెలియజేయడం జరిగింది. వేణు స్వామి తెలిపిన రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి.
Venu Swamy : మేష రాశి…
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా తలచిన కార్యాలు అన్నీ కూడా నెరవేరగలవు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విద్యారంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Venu Swamy : వృషభ రాశి.
వృషభ రాశి ఫలితాలు క్రోధినామ సంవత్సరం అంతా కూడా అధిక ధన వ్యయం ఉంటుంది.ఎక్కువగా డబ్బులను ఖర్చు చేస్తూ ఉంటారు. వ్యసనాల భారీన పడే అవకాశం ఉంటుంది.
Venu Swamy : మిధున రాశి..
మిధున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలతో ఉత్సాహంగా ఉంటుంది. తలచిన కార్యాలు అన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది.
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారి గ్రహస్థితి పరిశీలిస్తే క్రోధినామా సంవత్సరం ధనముకు ఇబ్బంది రాదు. అనుకున్న సమయానికి ధనము లభించును. ఎప్పటినుంచో రావాల్సిన పాతబాకీలు వసూలు అవుతాయి. కీర్తి మనోధైర్యము పెరుగును. కానీ ఆరోగ్యం మందగించును.
సింహరాశి.
ఈ రాశి యొక్క గ్రహ స్థితిని పరిశీలిస్తే తరచుగా బంధుమిత్ర కలహాలు, అనారోగ్య సమస్యలు, మానసిక ఆరోగ్య, శారీరక ఇబ్బందులు కలుగును.
కన్యారాశి.
ఈ రాశివారికి క్రోధి నామ సంవత్సరం అంతా శుభకార్య ఫలితాలలో ఆనందంగా ఉంటారు.మనోధైర్యం చేకూరుతుంది. శత్రు పీడ తొలగిపోతుంది.మిత్ర లాభం కలుగును. రుణములు తీరిపోతాయి.
తులారాశి.
ఈ రాశి వారు అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం లో ఆటంకాలు ఏర్పడును.అనుకున్న పనులు అన్ని చివరి నిమిషం లో నిరాశకు గురిచేస్తాయి.ఈ రాశి వారికి అనారోగ్య బాధలు ఎక్కువగా ఉంటాయి.
వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారి గ్రహ స్థితి పరిశీలిస్తే శుభ ఫలితములు కలుగును. మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. విలాసమంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇంట్లో పలు రకాల శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
ధనస్సు రాశి.
సకల కార్యములందు విజయం పొందుతారు. మిత్ర లాభం ,ధన వ్యయం మాత్రం అపరిమితంగా ఉండును. ధనమును విపరీతంగా ఖర్చు పెడతారు. అలాగే రుణం పొందాల్సిన అవసరం వస్తుంది.బ్యాంకుల నుండి రుణాలను పొందే అవకాశం ఉంటుంది.
మకర రాశి.
ఈ రాశి వారి గ్రహ స్థితి పరిశీలిస్తే ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. సకల కార్యములందు నిరాశ. మానసిక ప్రశాంత తగ్గిపోవును. విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. బంధుమిత్రుల వలన కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది.
కుంభరాశి.
ఏలినాటి శని, జన్మ శని కనిపిస్తుంది.తలచిన కార్యాలు అన్నీ కూడా వాయిదా పడతాయి.గృహ నిర్మాణ పనులు వాయిదా పడతాయి.అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాల వలన ఇబ్బందులు కలుగుతాయి.
మీన రాశి.
మీన రాశి వారి గ్రహస్థితి పరిశీలిస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడతాయి.వీరికి అవమానం కలుగును. బంధుమిత్రులతో కలహాలు ఉంటాయి.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు.