zodiac signs will become gold that has been trapped in the soil
Zodiac Signs : ఆంగ్ల సంవత్సరం 2022 త్వరలో ప్రారంభకానున్నది. అయితే ఆయా రాశుల వారు పండితులు చెప్పే విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం… మేషరాశి : పని వత్తిడి, లేదా భారం అనుకోకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. ఇలా చేస్తే మీరు కోరుకునే స్థానానికి చేరుకోవడమే కాకుండా మంచి ఆనందాన్ని సొంతం చేసుకుంటారు. కష్టేఫలి అనే సూక్తి ఈ ఏడాది మేషరాశి వారికి చక్కగా సరిపోతుంది. వృషభరాశి : మీరు నిజాయితీకి మారుపేరు అయిన రాశి. మీరు ఆత్మీయులను, దగ్గరి వారిని, ఆఫీస్లో పై అధికారులతో నిజాయితీగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీ భావాలను మనసులో పెట్టుకోకుండా బయటపెట్టడం వల్ల మంచి ఫలితాలు సాధించగలరు.
మిథునరాశి : టైం టేబుల్ పక్కా ఫాలో అయితే ఈ ఏడాది మీకు ఆనందం సొంతం. అంతేకాదు శారీరక సౌందర్యం కోసం కూడా కొంత సమయాన్ని తప్పక కేటాయించుకోండి దీనివల్ల బహుళ ప్రయోజనాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి : ఈరాశి వారికి గ్రహగతుల వల్ల కొన్ని ఇబ్బందులు వున్నాయి. వాటిని అధిగమించడానికి స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు (క్రిస్టల్ సాల్ట్) వేసుకుని స్నానం చేయండి. దీనివల్ల మీకు రాబోయే బాధలు తప్పక తీరుతాయి.
zodiac signs 2022 predictions use this tips as per astrology
సింహరాశి : ఈరాశి వారికి మనస్సు ప్రశాంతత కోసం ఇష్టమైన వాటిని చేయాలి అంటే అవి ధర్మ బద్ధంగా ఉండాలి. ముఖ్యంగా కళలు అంటే నృత్యం, సంగీతం వంటివిచేస్తూ ఉంటే మీకు మంచిగా ఉంటుంది.
కన్యరాశి : ఈ ఏడాది వత్తిడి బాగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని అధిగమిస్తే మంచి పలితాలు మీ సొంతం దీని కోసం నిత్యం యోగా, ప్రాణాయామం తప్పక క్రమం తప్పకుండా చేయండి.స్వేచ్ఛగా మీ మనసులోని మాటలను చెప్పండి. రిలాక్స్గా ఉండండి.
తులారాశి : ఈరాశి వారికి ఎప్పుడు ఎదుటివారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. పక్క లేదా ఎదుటి వారి కోసం శ్రమిస్తారు. ఈ ఏడాది మీరు మీ కోసం శ్రమిస్తే మంచి ఫలితాలు వస్తాయి
వృశ్చికరాశి : ఈ ఏడాది మీరు అత్యంత సంతోషంగా ఉండాలంటే తప్పక చేయాల్సింది వ్యాయామం, నిత్యం వాకింగ్, సైక్లింగ్. దీనివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత లబిస్తుంది అన్నింటా విజయాలు సాధిస్తారు.
ధనుస్సురాశి : మీరు విజయం సాధించాలంటే ఆరోగ్యం తప్పనిసరి. అయితే దీనికి శ్రమతోపాటు విశ్రాంతి కూడా చాలా ముఖ్యం. ఈ ఏడాది మీరు శ్రమకు తగ్గ విశ్రాంతి తీసుకుంటే తప్పనిసరిగా శక్తి పెరిగి మరింత పని చేసి విజాయాలను సొంతం చేసుకుంటారు.
మకరరాశి : విజయాలు సాధించాలంటే పట్టుదల ముఖ్యం. ఈ ఏడాది మీరు అనవసర విషయాల జోలిక వెళ్లకుండా వేరే పనులను పక్కన బెట్టి మీ లక్ష్యం వైపు వెళితే చాలు విజయ కిరీటం మీ సొంతం అవుతుంది.
కుంభరాశి : ఈ ఏడాది ఆశ, నిరాశలకు అవకాశం ఉంది. అయితే మీరు మంచి మనస్సు అంటే ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తే ఉత్సహంగా పనిచేయగలరు. దీనికోసం సంగీతం, ఇష్టమైన సినిమాలను చూడటం వంటివి విశ్రాంతి సమయంలో చేస్తే మంచిది.
మీనరాశి : విజయం సాధించాలంటే క్లారిటీ ఆఫ్ థాట్ చాలా ముఖ్యం. దీని కోసం మనస్సు ప్రశాంతత చాలా అవసరం. దీనికోసం ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా, మెడిటేషన్ అంటే ధ్యానం చేయండి. మీరు విజయ మార్గాన తప్పక ప్రయాణిస్తారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.