Nani shyam singha roy movie review and live updates
Shyam Singha Roy Movie Review : గత శుక్రవారం పుష్ఫ సినిమా రిలీజ్ అయి బాక్సాఫీసు రికార్డులను తిరగరాసింది. తాజాగా శ్యామ్ సింగ రాయ్ మూవీ వారం గ్యాప్ లో రిలీజ్ అయింది. ఒక పెద్ద సినిమా తర్వాత.. వారం గ్యాప్ లోనే క్రిస్ మస్, న్యూ ఇయర్ కానుకగా.. నాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ మూవీ తాజాగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మించారు. నానికి జోడిగా ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడొన్నా సెబాస్టియన్ నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావడంతో.. మన కంటే ముందే యూఎస్ లో రిలీజ్ అయిపోయింది. దీంతో అక్కడ యూఎస్ ప్రీమియర్ షో చూసిన వాళ్లు సినిమా ఎలా ఉందో ముందే చెప్పేశారు. సినిమా కథ, సినిమాలో హీరో, హీరోయిన్ల పర్ ఫార్మెన్స్ ఎలా ఉందో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఈ సినిమాలో మన హీరో నాని పేరు వాసు. పెద్ద ఫిలిం డైరెక్టర్ కావాలనేది వాసు లక్ష్యం. ముందు తను ఒక షార్ట్ ఫిలిం తీస్తుంటాడు. ఆ షార్ట్ ఫిలింలో నటించేందుకు కీర్తి అనే యువతిని ఒప్పిస్తాడు. ఆ తర్వాత ఆ షార్ట్ ఫిలిం అందరికీ నచ్చడం.. వెంటనే పెద్ద సినిమా ఆఫర్ రావడం.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో వాసు దశే మారుతుంది. పెద్ద డైరెక్టర్ అయిపోతాడు. అయితే.. అదే సినిమాను హిందీలోనూ డైరెక్ట్ చేసి కొన్ని లీగల్ సమస్యల్లో చిక్కుకుంటాడు వాసు.
Nani shyam singha roy movie review and live updates
సినిమా పేరు : శ్యామ్ సింగ రాయ్
నటీనటులు : నాని, సాయి పల్లవి, కృత శెట్టి, మడొన్నా సెబాస్టియన్
డైరెక్టర్ : రాహుల్ సాంకృత్యన్
ప్రొడ్యూసర్ : వెంకట్ బోయనపల్లి
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జే మేయర్
రన్ టైమ్ : 2 గంటల 37 నిమిషాలు
రిలీజ్ డేట్ : 24 డిసెంబర్ 2021
ఆ తర్వాత అసలు వాసు దేవ్, శ్యామ్ సింగ రాయ్ మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయం బయటపడుతుంది. తన గతం గురించి కొన్ని సందర్భాల్లో వాసుకు తెలిసివస్తుంది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ ఎంట్రీ ఉంటుంది. శ్యామ్ సింగ రాయ్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేశాక.. సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయి ఇంటర్వెల్ పడుతుంది.
సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. ఫస్ట్ హాఫ్ లో వాసు దేవ్ స్టోరీనే డైరెక్టర్ ఎక్కువగా ఎలివేట్ చేశాడు. ఆ తర్వాత వాసు దేవ్, శ్యామ్ సింగ రాయ్ కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే సినిమాను పక్కదారి పట్టించకుండా.. తను ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్టర్ స్ట్రెయిట్ గా చెప్పేశాడు.
ఇక సెకండ్ హాఫ్.. వెస్ట్ బెంగాల్ లో ప్రారంభం అవుతుంది. ఇది శ్యామ్ సింగరాయ్ కథ. అక్కడ జరిగే కొన్ని అరాచకాలకు ఎదురు తిరిగే వ్యక్తి శ్యామ్ సింగ రాయ్. అందుకే తన ఇంటి నుంచి వెళ్లిపోయి.. ప్రజల హక్కుల కోసం పోరాడుతుంటారు. అక్కడే దేవదాసి(సాయి పల్లవి)ని చూస్తాడు శ్యామ్. తను ఒక నర్తకి. గుళ్లలో డ్యాన్సులు వేస్తుంటుంది.
తన పేరు మైత్రి. తనను ఒకసారి గుడి బయట కలుస్తాడు శ్యామ్. అలా రెండు మూడు సార్లు వాళ్లు గుడి బయట కలుస్తారు. ఆ తర్వాత ప్రణవలయ పాట వస్తుంది. అది బాగుంది. అయితే.. గుళ్లలో నాట్యాలు చేసే దేవ దాసీల మీద మహంత్ చెడుగా ప్రవర్తించడం.. వాళ్లపై దాడి చేయడం చేస్తాడు. దీంతో మహంత్ తో గొడవ పెట్టుకుంటాడు శ్యామ్. ఆ తర్వాత మైత్రిని తీసుకొని కోల్ కతా వచ్చేస్తాడు. ఆ తర్వాత ఒక విప్లవ రచయితగా మారుతాడు శ్యామ్. చాలా గొప్ప వ్యక్తి అవుతాడు. ఇంతలో శ్యామ్ సింగ రాయ్ ని కొందరు వ్యక్తులు చంపేస్తారు. ఆ తర్వాత ప్రస్తుత కథలోకి సినిమా వచ్చేస్తుంది. శ్యామ్ సింగ రాయ్ గురించి ఆయన స్టోరీ గురించి తెలుసుకున్న వాసుదేవ్.. వెంటనే కోల్ కతా వెళ్తాడు. అక్కడ మైత్రి కోసం వెతుకుతాడు. ఆ తర్వాత కోర్ట్ రూమ్ డ్రామాతో సినిమా ముగుస్తుంది.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.