Shyam Singha Roy Movie Review : నాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ నటి సాయి పల్లవి కాంబినేషన్ లో మూవీ ప్రకటనే శ్యామ్ సింగరాయ్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొల్పింది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ఏం.సీ.ఏ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలవగా.. ఘాజీ అనే మొదటి సినిమాతోనే ప్రశంసలతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకున్న రాహుల్ సాంకృత్యాన్ కోసం వీరివురు మళ్ళీ జత కట్టారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్లుగా కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
హీరోయిన్ సాయి పల్లవి వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభమవుతుంది. అనంతరం హీరో నాని వాసు పాత్రలో పరిచయమవుతాడు. దర్శకుడు కావాలనే కోరికతో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ లు చేస్తూ ఉంటాడు వాసు. అలా కృతి శెట్టిని తన షార్ట్ ఫిలింలో నటింపజేసే ప్రయత్నంలో ఆమెతో ప్రేమలో పడతాడు. అలా అతని ప్రేమతో పాటు సినిమా కూడా సక్సెస్ అయి అతనికి పెద్ద మూవీ ఆఫర్స్ వస్తాయి. అలా వాసు పెద్ద దర్శకుడు అవుతాడు. అలా తెలుగులో హిట్ అయిన ఓ సినిమాను హిందీలోనూ డైరెక్ట్ చేసి కొన్ని లీగల్ సమస్యల్లో చిక్కుకుంటాడు వాసు. అది వివాదంగా మారి అరెస్ట్ అవుతాడు. వాసును ఇంటారాగేశన్ చేసే అధికారి పాత్రలో ప్రేమమ్ ఫేం మడోన్నా సెబాస్టియన్ ఎంట్రీ ఇస్తుంది. అయితే వాసు ఎందుకు అరెస్ట్ అయ్యాడనేది కథలో ఆసక్తికర అంశం. ఇంటర్వెల్ కు ముందే నాని శ్యామ్ సింగరయ్ పాత్రతో ఎంట్రీ ఇస్తాడు.
చిత్రం : శ్యామ్ సింగరాయ్
నటీ నటులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ తదితరులు.
సంగీతం : మిక్కీ జే మేయర్
బ్యానర్ : నిహారిక ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు : వెంకట్ బోయనపల్లి
దర్శకత్వం: రాహుల్ సాంకృత్యాన్
విడుదల తేది : 24-12-2021
పశ్చిమ బెంగాల్ లో ప్రారంభమైన రెండో అర్ధభాగంలో నాని సామాజిక కార్యకర్త శ్యామ్ సింగరాయ్ గా అక్కడ జరిగే అరాచకాలకు ఎదురు తిరిగుతుంటాడు. ఓ గుళ్ళో దేవదాసీగా ఉండే మైత్రేయి(సాయి పల్లవి) తో ప్రేమలో పడతాడు. దేవస్థానంలో నాట్యం చేసే ఆమె పట్ల చెడుగా వ్యవహరించే వారికి ఎదురుగా పోరాడి ఆమెను తీసుకుని అక్కడించి కోల్ కతా వచ్చేస్తాడు. అనంతరం ఓ గొప్ప విప్లవ రచయితగా మారిన శ్యామ్ ను కొంతమంది దుండగులు చంపేస్తారు. కథ మళ్ళీ ప్రస్తుత కాలంలోకి సినిమా వచ్చేస్తుంది. శ్యామ్ సింగ రాయ్ గురించి తెలుసుకున్న వాసు కోల్ కతా వెళ్లి మైత్రేయి కోసం వెతుకుతాడు. అయితే అతనికి ఆమె దొరికిందా.. అసలు వాసుకి, శ్యామ్ సింగ రాయ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి..? మొత్తానికి వాసు ఆ కేసు నుండి బయటపడ్డాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!
సినిమా ప్రారంభంలో పాత్రల పరిచయం తొందరగానే అయినప్పటికీ మొదటి భాగమంతా కాస్త నెమ్మదిగా నడిచి ఇంటర్వెల్ ముందు ఇంటరెస్టింగ్ గా మారుతుంది. శ్యామ్ సింగ రాయ్ పాత్రలో నాని ఎంట్రీ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లేలా ఉంటుంది. దర్శకుడు కావాలనుకున్న వాసు భవిష్యత్ ను… దర్శకుడు రాహుల్ శ్యామ్ సింగ రాయ్ పాత్రలో ముడిపెట్టిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. రెండో అర్ధ భాగంలో నాని.. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే సామాజిక కార్యకర్త శ్యామ్ సింగ రాయ్ గా చేసే పోరాటం సినిమాలో ఒక మెయిన్ ఎలిమెంట్ గా చెప్పవచ్చు. తమతో చేతులు కలపమని శ్యామ్ ని నక్సలైట్స్ కోరినప్పుడు… ఆయన అందుకు అంగీకరించకుండా బుల్లెట్స్ కంటే రచనలు ఎంతో శక్తివంతమైనవి అని చెప్పే కొన్ని డైలాగ్ లు ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆకట్టుకుంటుంది.
నాని.. వాసుగా, శ్యామ్ సింగరాయ్ గా రెండూ పాత్రల్లోనూ జీవించేశాడు. మోడ్రన్ పాత్రలో ఈజీగా నటించేసిన న్యాచురల్ స్టార్… శ్యామ్ సింగరాయ్ పాత్రలో దుమ్ము దులిపేశాడు. ఇక సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పదేముంది. సాధారణంగానే చాలా ఎనర్జిటిక్ గా నటించే పల్లవి… దేవదాసి వంటి ప్రత్యేక పాత్రలు పడితే ఊరుకుంటుందా..? అసలు సినిమా ముగిసేంత వరకు మైత్రేయిని చూస్తున్నట్లే ఉంటుంది. ప్రణవలయ సాంగ్ లో పడ్డ శ్రమంతా తెరపై మనకు కనిపిస్తుంది. సాయి పల్లవి ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి అందం అభినయంతో మెప్పించింది. మిక్కీ జే మేయర్ సంగీతం సోసోగా ఉన్నా.. నేపథ్య సంగీతం తో ఆకట్టుకున్నాడు. దర్శకుడు రాహుల్ కు ఇది రెండో సినిమా అయినప్పటికీ ఎక్కడ తడబడకుండా కథ చెబుతూ పోయాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రతి ప్రేముకి క్లాసిక్ టచ్ ఇచ్చాడు దర్శకుడు. కొన్ని సీన్స్ కు థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయంగా కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్:
– నాని, సాయి పల్లవి నటన
-ఎమోషనల్ సన్నివేశాలు
– నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్:
– సన్నివేశాలు తేలిపోవడం
– ముందే అంచనా వేసే కొన్ని సీన్స్
– పాటలు
రేటింగ్: 3
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.