Hyderabad : హైదరాబాద్ లో ప్రమాదకర స్థాయికి చేరుకున్న గాలి కాలుష్యం.. మరో ఢిల్లీలా భాగ్యనగరం?
Hyderabad : ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడాలంటే మనం ముందు ఢిల్లీ గురించే మాట్లాడుకోవాలి. మన దేశంలో ఢిల్లీలో ఉన్న గాలి కాలుష్యం ఇంకెక్కడ ఉండదు. ఢిల్లీ తర్వాతనే ఇంకెక్కడైనా. కానీ.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఈ మధ్య గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దానికి కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఎయిర్ పొల్యూషన్ వల్ల హైదరాబాద్ చాలా ప్రమాదకర స్థాయికి చేరుకుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాగే ఈ ఎయిర్ పొల్యూషన్ పెరుగుతూ పోతే హైదరాబాద్ మరో ఢిల్లీ అవుతుందని అంటున్నారు. ఎయిర్ పొల్యూషన్ ను తగ్గించేందుకు అందరూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిజానికి గాలి కాలుష్యం అనేది ఎక్కువగా చలికాలం మొదలవుతుంది. గాలిలో కాలుష్య కారకాలు పెరగడం వల్ల గాలి కాలుష్యం పెరుగుతోంది. అలాగే.. రోజు రోజుకూ వాహనాలు పెరగడం, వాటి నుంచి వచ్చే పొగ గాలిలో కమ్మేస్తుండటం వల్ల గాలిలో పొల్యూషన్ లేవల్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల డిసెంబర్ 4 న చేసిన గణాంకాలు చూస్తే.. ఎయిర్ క్వాలిటీ అత్యధికంగా సనత్ నగర్ లో ఉంది. ఇండెక్స్ ప్రకారం అక్కడ 333 పాయింట్లు నమోదు అయ్యాయి. ఇక.. అత్యల్పంగా 99 పాయింట్లు నమోదయ్యాయి.
Hyderabad : గాలి నాణ్యత సూచీ ప్రకారం అత్యధికంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో
గాలి నాణ్యత సూచీ ప్రకారం.. అత్యధికంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 183 పాయింట్లు ఉండగా, అత్యల్పంగా 88 పాయింట్లు నమోదయ్యాయి. నిజానికి ఎయిర్ ఇండెక్స్ 50 పాయింట్లు దాటకూడదు. ఎయిర్ పొల్యూషన్ పెరిగితే.. చాలామంది ఆరోగ్యం పాడవుతుంది. నిజానికి.. దేశంలోని మెట్రో నగరాలు అన్నింటిలో వాయు కాలుష్యం పెరిగినప్పటికీ.. ఢిల్లీ తర్వాత అంత ప్రమాదకరమైన స్థాయి హైదరాబాద్ లో ఉందట. ఆ తర్వాత చెన్నై కూడా అదే డేంజర్ జోన్ లో ఉందట. బెంగళూరులో హైదరాబాద్ తో పోల్చితే గాలి నాణ్యత సూచీ ప్రకారం అంతగా ప్రమాదకర స్థాయి లేదని అంటున్నారు.