Hyderabad.. స్వచ్ఛత విషయంలో చిత్తశుద్ధి అవసరం
స్వచ్ఛత విషయంలో జీహెచ్ఎంసీ సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలని కాచిగూడ కార్పొరేటర్ ఉమాదేవి అన్నారు. గురువారం ఆమె స్వచ్ఛ ఆటోలను నింబోలి అడ్డా వద్ద తన ఆఫీసు సమీపంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నగర ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త రిక్షాలలో వేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరు పరిశుభ్రత పాటించాలని చెప్పారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యమని తెలిపారు. నింబోలి అడ్డా వద్ద ఉన్న కార్యాలయం దగ్గర స్వచ్ఛ ఆటోలను జెండా ఊపి కార్పొరేటర్ ప్రారంభించారు.
జీహెచ్ఎంసీ సిబ్బంది స్వచ్ఛత విషయంలో శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమాదేవితో పాటు నాయకులు కన్నె రమేశ్, సంతోశ్, మల్లికార్జున్, రఘు పాల్గొన్నారు. ఇకపోతే నగరంలో స్వచ్ఛత విషయమై కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో అధికారులు శ్రద్ధ వహిస్తున్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌గా నగరాన్ని ఉంచాలని ప్రజలకు పలు ఎన్జీవో సంస్థలు ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నాయి.