Hyderabad : హైదరాబాద్ లో గన్ ఫైరింగ్.. బంగారం షాపులోకి చొరబడి తుపాకీతో బెదిరించి నగలన్నీ ఎత్తుకెళ్లారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyderabad : హైదరాబాద్ లో గన్ ఫైరింగ్.. బంగారం షాపులోకి చొరబడి తుపాకీతో బెదిరించి నగలన్నీ ఎత్తుకెళ్లారు

 Authored By kranthi | The Telugu News | Updated on :2 December 2022,8:30 am

Hyderabad : ఈ మధ్య ఎక్కడ చూసినా గన్ కల్చర్ పెరిగిపోయింది. చాలామందిని గన్ తో బెదిరించడం చూశాం కదా. ముఖ్యంగా దుండగులు గన్ లను వాడి దొంగతనాలు చేయడం చూస్తుంటాం. తాజాగా బంగారం షాపులో దొంగలు సృష్టించిన హడావుడి హైదరాబాద్ లో కలకలం లేపింది. నగరంలోని నాగోల్ లో ఉన్న స్నేహపురి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

gun firing in gold shop in hyderabad created havoc

స్నేహపురి కాలనీలో ఉన్న ఓ బంగారం షాపులోకి చొరబడిన ఇద్దరు దుండగులు గన్ తో బంగారం యజమానిని బెదిరించారు. అయితే.. బంగారం షాపు యజమాని దుండగులతో పోరాడినట్టు తెలుస్తోంది. దీంతో దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆ వ్యక్తికి తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది. అనంతరం షాపులోని బంగారం మొత్తాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు.

Hyderabad : సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే ప్రాథమిక వివరాలను సేకరించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను బేస్ చేసుకొని వివరాలను సేకరిస్తున్నారు. దుండగులు ఎవరు.. ఎక్కడికి పారిపోయారు. ఎలా పారిపోయారు.. వాళ్లకు గన్ ఎక్కడిది అనే అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే.. ఒక్కసారిగా నాగోల్ లో కాల్పులు చోటు చేసుకోవడంతో నగరం ఉలిక్కిపడింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది