Hyderabad Rains : హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. రేపు ఉదయం వరకు కంటిన్యూ.. అవసరం అయితే తప్ప అస్సలు బయటికెళ్లకండి
Hyderabad Rains : ఇప్పుడిప్పుడే భాగ్యనగరం భారీ వర్షాలు, వరదల బారి నుంచి బయటపడి కాస్త కుదుటపడుతోంది. వర్షం ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చింది అంతే. మళ్లీ ఇవాళ సాయంత్రం నుంచి నగరంలో వాన దంచికొడుతోంది. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి వాతావరణం ఏర్పడింది. ఏం జరుగుతోందా అని నగరవాసులు బిక్కుబిక్కుమంటూ చూశారు. బాగా గాలి వీచి ఆ తర్వాత ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది.
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూనే ఉంది. సాయంత్రం 4 నుంచి కంటిన్యూగా పడుతూనే ఉంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అయితే.. స్కూల్ పిల్లలు బడుల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వర్షం ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. ఆఫీసుల నుంచి ఉద్యోగులు బయటికి వచ్చే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో ఉద్యోగులు ఇంటికి ఎలా వెళ్లాలా అని టెన్షన్ పడుతున్నారు.భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయింది. ఎందుకంటే.. ఈ వర్షం రేపు ఉదయం అంటే మంగళవారం ఉదయం వరకు కంటిన్యూ అవుతుందని జీహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది.
Hyderabad Rains : జీహెచ్ఎంసీ అప్రమత్తం
అవసరం అయితే తప్ప నగర వాసులు బయటికి రావద్దని హెచ్చరించింది. రేపు ఉదయం వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు జీహెచ్ఎంసీ వెల్లడించింది. వర్షాలకు సంబంధించి ఏదైనా సాయం కావాలనుకునే వారు 040 21111111 నెంబర్ కు లేదా 9000113667 నెంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచించారు.