Crime News : జేఎన్టీయూలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. కారణం అదేనా? షాక్ లో విద్యార్థులు
Crime News : హైదరాబాద్ లోని జేఎన్టీయూ యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. జేఎన్టీయూలో ఉన్న సీఎస్ఆర్ బిల్డింగ్ పై నుంచి దూకి మేఘనా రెడ్డి అనే 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తను జేఎన్టీయూలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మేఘనారెడ్డి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో జేఎన్టీయూలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

jntu engineering student commits suicide in hyderabad
ఇతర విద్యార్థులు కూడా షాక్ లో ఉన్నారు. ఇంకొన్ని నెలల్లో ఇంజినీరింగ్ కూడా పూర్తయిపోయి.. బయటికి వెళ్లి జాబ్ చేసుకునే క్రమంలో తను ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే కోణంలో పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. అయితే.. మేఘనా రెడ్డి స్నేహితుల కథనం ప్రకారం.. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు.
Crime News : గతంలోనూ మానసిక సమస్యలకు ట్రీట్ మెంట్ తీసుకున్న మేఘనారెడ్డి
అయితే.. మేఘనారెడ్డికి మానసిక సమస్యలు ఉన్నాయట. తను గతంలోనూ ఈ మానసిక సమస్యలకు ట్రీట్ మెంట్ తీసుకుందట. అయినా కూడా తనకు ఆరోగ్యం కుదుటపడలేదని.. తీవ్రంగా ఇబ్బందులు పడేదని తన ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే.. తన అనారోగ్య సమస్యలకు భయపడి మేఘనారెడ్డి ఆత్మహత్య చేసుకుందా? లేక తను ఆత్మహత్య చేసుకోవడానికి మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనా మేఘనారెడ్డి ఆత్మహత్యతో జేఎన్టీయూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జేఎన్టీయూ అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అందరినీ మోటివేట్ చేస్తున్నారు.