Hyderabad : ఐటీ ఉద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలికి స్పెషల్ బస్సులు.. వాళ్లకోసమే
Hyderabad : తెలంగాణకు హైదరాబాద్ తలామానికం అనే విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ ఈ దేశానికే దిక్సూచి. ముఖ్యంగా ఐటీ పరంగా హైదరాబాద్ దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉంది. దాని వల్ల హైదరాబాద్ కు మరింత పేరు వచ్చింది. అందుకే.. ఐటీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. ఐటీ కారిడార్ లో అన్నిరకాల చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ జామ్ కోసం ఫ్లైఓవర్స్, రోడ్లు, రవాణా సదుపాయాన్ని కల్పిస్తోంది.
తాజాగా టీఎస్ఆర్సీపీ ఐటీ ఉద్యోగుల కోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ఉన్న హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాలకు సిటీ నలుమూలల నుంచి రోజూ కొన్ని వేల మంది ఐటీ జాబ్ కోసం వెళ్తుంటారు. వాళ్ల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని నిర్ణయించింది.
Hyderabad : డెడికేటెడ్ బస్సులు ఐటీ ఉద్యోగుల కోసమే ప్రారంభం
ఐటీ ఉద్యోగుల కోసం డెడికేటెడ్ బస్సులను వాళ్లు ఉండే ప్రాంతాలకే ఉదయం వెళ్లి పికప్ చేసుకొని వాళ్ల కంపెనీ దగ్గర బస్సులు వదిలిపెడతాయి. మళ్లీ సాయంత్రం ఆఫీసుల దగ్గరికి వెళ్లి తిరిగి వాళ్ల ఇంటి వద్ద దింపుతాయి. దీని కోసం తమ అభిప్రాయాలను, తమ వివరాలను పంపించాలని టీఎస్ఆర్టీసీ ఒక ఫామ్ ను ఆన్ లైన్ లో ఉంచింది. ఆ ఫామ్ ను నింపితే.. దాని ప్రకారం ఆర్టీసీ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. లోకేషన్, పికప్, డ్రాపింగ్ నమోదు చేస్తే ఆర్టీసీ అధికారులే వాళ్లకు కాంటాక్ట్ చేస్తారు. డిసెంబర్ 5 లోపు వివరాలు నమోదు చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ తెలిపారు.
Hello Tweeple, Kindly fill out this form: https://t.co/nUoOhW1Lt4
Last date to submit: 05-Dec-22 pic.twitter.com/Jr6uyA2iba— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) November 30, 2022