Hamsa Nandini : ఇది ఆత్మవిశ్వాసం అంటే.. క్యాన్సర్ సోకినా.. ఎంతో ధైర్యంతో దానితో పోరాడుతున్న తెలుగు హీరోయిన్.. ఇన్ స్టాలో ఏం పోస్ట్ చేసిందో తెలుసా?
Hamsa Nandini : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా, నటిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న హంసా నందిని కొన్ని రోజుల నుంచి క్యానర్స్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ‘కేన్సర్ డే‘ సందర్భంగా.. మహమ్మారితో తన పోరాటాన్ని ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ , ఫేస్ బుక్ లో షేర్ చేసుకుంది. జీవితం నా మీద ఎన్ని సవాళ్లు విసిరినా, అది ఎంత అన్యాయంగా ఉన్నా.. నేను బాధితురాలిని అవ్వడానికి అంగీకరించను. భయం, నిరాశ, ప్రతికూలత నన్ను లొంగదీయడానికి నేను ఒప్పుకోను. నేను ఓటమిని ఒప్పుకోను. ధైర్యంతో, ప్రేమతో నేను జీవితంలో ముందుకు వెళ్తాను. 4 నెలల క్రితం, నా రొమ్ములో చిన్న గడ్డ ఉన్నట్లు అనిపించింది. నా జీవితం మునపటిలో ఉండదని ఆ క్షణం అనిపించింద. 18 సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన వ్యాధితో మా అమ్మను కోల్పోయాను. నేను దాని చీకటి నీడలో జీవించాను. నేను చాలా భయపడ్డాను.
కొన్ని గంటల్లో, నేను మామోగ్రఫీ క్లినిక్‌లో గడ్డను చెక్ చేశారు. నాకు బయాప్సీ అవసరమని చెప్పిన సర్జికల్ ఆంకాలజిస్ట్.. నన్ను వెంటనే కలవమన్నారు. నేను భయపడినట్లే.. బయాప్సీలో నాకు కేన్సర్ ఉన్నట్లు తెలిసింది. నాకు గ్రేడ్ III ఇన్వాసివ్ కార్సినోమా (రొమ్ము క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది.ఎన్నో స్కాన్‌లు, పరీక్షల తర్వాత.. ఆపరేషన్ థియేటర్ కి ధైర్యంగా వెళ్లాను. ముందుగానే కేన్సర్ ని గుర్తించడం వల్ల అది ఎక్కువగా వ్యాపించలేదు. ఆ ఆనందం ఎక్కువ కాలం లేదు. నేను బీఆర్సీఏ 1 (వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్) పాజిటివ్ వచ్చింది. నా జీవితంలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 70%,అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 45% ఉంది. ఎన్నో శస్త్ర చికిత్స తర్వాత మాత్రమే.. నేను విజయం సాధించగలను. నేను ఇప్పటికే 9 సార్లు కీమోథెరపీ చేయించుకున్నాను, ఇంకా 7 సార్లు చేయించుకోవాలి.
Hamsa Nandini : నాకు నేను కొన్ని వాగ్దానాలు చేసుకున్నాను:-
ఈ వ్యాధిని నా జీవితాన్ని నిర్వచించనివ్వను, నేను దానితో చిరునవ్వుతో పోరాడి గెలుస్తాను. నేను ఇంకా మెరుగ్గా, బలంగా తెరపైకి వస్తాను. నా సోషల్ మీడియా ఇన్‌బాక్స్‌లు మీ సందేశాలతో నిండిపోయాయి. నేను ఈ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే మీ ప్రేమకు నా ధన్యవాదాలు. నేను అసాధారణమైన వైద్యుల బృందం సంరక్షణలో ఉన్నాను. నేను ఈ మహమ్మారిపై గెలుపొంది.. మీ ముందుకు వస్తానని హామీ ఇస్తాను.’ అని సోషల్ మీడియా లో హంసా నందిని పోస్ట్ పెట్టారు.