Inspirational Story : 55 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం… పిచ్చోడి నుండి బడి పంతులుగా మారిన కేదరేశ్వరరావు క‌థ వింటే క‌న్నీళ్లు ఆగ‌వు..!..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Inspirational Story : 55 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం… పిచ్చోడి నుండి బడి పంతులుగా మారిన కేదరేశ్వరరావు క‌థ వింటే క‌న్నీళ్లు ఆగ‌వు..!..!

Inspirational Story : టీచర్ గా పిల్లలకు చదువు చెప్పాలి అని కలలు కన్న ఓ టీచర్ కళ దాదాపు 23 సంవత్సరాలు తర్వాత నెరవేరింది అని చెప్పాలి. 1998 లోనే డీఎస్సీ DSC Exam  రాత పరీక్ష రాసి ఎంపికైన అలక కేదారేశ్వర రావు నియామకాలు రాకపోవడంతో ఉద్యోగం కోసం చూస్తూ 23 ఏళ్లు అలాగే గడిపేసాడు. అయితే తాజాగా జగన్ ప్రభుత్వం ప్రకటనతో ఉద్యోగం పొందిన కేదారేశ్వరరావు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అయితే […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 March 2024,7:30 pm

ప్రధానాంశాలు:

  •  Inspirational Story : 55 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం...పిచ్చోడి నుండి బడి పంతులుగా మారిన కేదరేశ్వరరావు..!

Inspirational Story : టీచర్ గా పిల్లలకు చదువు చెప్పాలి అని కలలు కన్న ఓ టీచర్ కళ దాదాపు 23 సంవత్సరాలు తర్వాత నెరవేరింది అని చెప్పాలి. 1998 లోనే డీఎస్సీ DSC Exam  రాత పరీక్ష రాసి ఎంపికైన అలక కేదారేశ్వర రావు నియామకాలు రాకపోవడంతో ఉద్యోగం కోసం చూస్తూ 23 ఏళ్లు అలాగే గడిపేసాడు. అయితే తాజాగా జగన్ ప్రభుత్వం ప్రకటనతో ఉద్యోగం పొందిన కేదారేశ్వరరావు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అయితే 1998లో రాసిన డీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సరే ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపానికి గురైన కేదారేశ్వరరావు బతుకుదెరువు కోసం తల్లితో కలిసి హైదరాబాద్ వస్తే అక్కడ తల్లి కనిపించకుండా పోయింది. చివరికి పిచ్చోడిలా మారిన కేదారేశ్వరరావు ఇప్పుడు టీచర్ గా పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే…

శ్రీకాకుళం Srikakulam Districts  AP జిల్లా సిద్ధి గ్రామానికి చెందిన అలక కేదారేశ్వర రావు Allaka Kedareswara Rao, డిగ్రీను పూర్తి చేసిన తర్వాత అన్నమలై విశ్వవిద్యాలయం నుంచి ఈడి పట్టా పొందారు. ఇక 1998లో డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించాడు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ నియామకాలు జరగకపోవడంతో గత 23 ఏళ్లుగా కేదారేశ్వర రావు ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ కాలాన్ని గడుపుతూ వస్తున్నాడు. అయితే తాజాగా జగన్ ప్రభుత్వం 1998 డీఎస్సీ అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ జాబితాలో కేదారేశ్వర రావు పేరు కూడా ఉండడంతో ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోయింది.ఇక దీనికి సంబంధించిన న్యూస్ వార్తాపత్రికలలో కూడా రావడంతో చాలామంది కేదారెశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఆయనతో కేక్ కట్ చేపించి కొత్త బట్టలు , చెప్పులు షూ ఇప్పించి రూపు రేఖలు మొత్తం మార్చేశారు. సెలూన్ కు తీసుకెళ్లి హెయిర్ కటింగ్ కూడా చేయించి మొత్తంగా కేదారేశ్వర రావుకు కొత్త రూపాన్ని తీసుకువచ్చారు.

Inspirational Story 55 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగంపిచ్చోడి నుండి బడి పంతులుగా మారిన కేదరేశ్వరరావు

Inspirational Story : 55 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం…పిచ్చోడి నుండి బడి పంతులుగా మారిన కేదరేశ్వరరావు..!

అయితే తనను తాను పోషించుకోవడానికి సైకిల్ పై తిరుగుతూ చీరలు అమ్ముకుంటున్న కేదారేశ్వర రావు తన విద్యార్హతకు సంబంధించిన ధ్రువపత్రాలను మాత్రం జాగ్రత్తగా దాచి పెట్టుకున్నారు. సిద్ధి గ్రామంలో ఓ పాడుబడిన ఇంట్లో ఉంటున్న అతను తన విద్యార్హతకు సంబంధించిన ధ్రువపత్రాలతో పాటు 1998లో తాను రాసిన డీఎస్సీ పరీక్ష హాల్ టికెట్ ను కూడా భద్రంగా దాచిపెట్టుకున్నారు. ఇక తాజాగా ప్రభుత్వం నుంచి జాబితా వెలువడడంతో 23 ఏళ్ల నిరీక్షణ తర్వాత 55 ఏళ్ల వయసులో కేదారేశ్వరరావు ఉద్యోగం పొందారు.ఆ విధంగా 55 ఏళ్ల వయసులో ఉద్యోగం సాధించిన కేదారేశ్వరరావు ప్రస్తుతం ఒక పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా వైరల్ గా మారింది. ఓ ప్రముఖ మీడియా సంస్థ అతన్ని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం తర్వాత అతను జీవితం ఎలా మారింది అనే విషయాలను తెలియజేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలో కేదారేశ్వర రావు ఉద్యోగం రాకముందు తన జీవితం ఎలా ఉందో ఉద్యోగం వచ్చిన తర్వాత తన జీవితం ఏవిధంగా మారిందో అనే విషయాలను మీడియాతో పంచుకోవడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో ఏంటో మీరు కూడా చూసేయండి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది