3 Feet Doctor : ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్…ఈయన కథ వింటే కన్నీళ్లు పెట్టాల్సిందే…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

3 Feet Doctor : ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్…ఈయన కథ వింటే కన్నీళ్లు పెట్టాల్సిందే…!

3 Feet Doctor  : మూడు అడుగులు ఉన్నాడని ఎంబిబిఎస్ కి వద్దన్నారు… కానీ ఇప్పుడు… గణేష్ బారయ్య ఇన్స్పిరేషనల్ స్టోరీ. మన జీవితంలో అనుకున్నది సాధించాలంటే కృషి తపనతో పాటు ఓపిక కూడా చాలా అవసరం. ఎన్ని సమస్యలు ఎదురైనా అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తూ పోరాడుతూనే ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. అయితే అలాంటి ఓ వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. 23 సంవత్సరాలు కలిగిన గణేష్ బారయ్య వృత్తిరీత్యా […]

 Authored By tech | The Telugu News | Updated on :13 March 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  3 Feet Doctor : ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్...ఈయన కథ వింటే కన్నీళ్లు పెట్టాల్సిందే...!

3 Feet Doctor  : మూడు అడుగులు ఉన్నాడని ఎంబిబిఎస్ కి వద్దన్నారు… కానీ ఇప్పుడు… గణేష్ బారయ్య ఇన్స్పిరేషనల్ స్టోరీ. మన జీవితంలో అనుకున్నది సాధించాలంటే కృషి తపనతో పాటు ఓపిక కూడా చాలా అవసరం. ఎన్ని సమస్యలు ఎదురైనా అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తూ పోరాడుతూనే ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. అయితే అలాంటి ఓ వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. 23 సంవత్సరాలు కలిగిన గణేష్ బారయ్య వృత్తిరీత్యా డాక్టర్. ఇక ఈయన ఎత్తు కేవలం మూడు అడుగులు మాత్రమే. అతి తక్కువ ఎత్తు కలిగిన డాక్టర్లలో గణేష్ బారయ్య ఒకరు. అయితే గణేష్ బారయ్య బాగ్ నగర్ జిల్లాలోని గోర్కె గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఇక ఆయనకు ఏడుగురు సోదరీమణులు ఒక సోదరుడు ఉన్నారు. అయితే గణేష్ ఎత్తు తక్కువగా ఉండటం వలన తాను చదువుకునే రోజుల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొనే వాడట. అయితే గణేష్ ను విమర్శించిన వారి కంటే సాయం చేసిన వారి సంఖ్య కూడా చాలా పెద్దది అని చెప్పాలి. ఆ విధంగా పలువురు సహకారంతో బాగ్ నగర్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేసిన గణేష్ ప్రస్తుతం ఇంటర్షిప్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ గణేష్ ఇంటర్వ్యూ చేయగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ రోజుల్లో నేను చాలా తక్కువ హైట్ ఉండటం వలన చాలామంది నన్ను ఎగతాళి చేసే వారిని , అయినప్పటికీ నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాదని తెలియజేశారు.

కాలక్రమెన అందరూ నన్ను నన్నుగా గుర్తించడం మొదలు పెట్టారని నేను కూడా ఆ వాస్తవాన్ని అర్థం చేసుకున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఎత్తులో చిన్న వాడినైనప్పటికీ జీవితంలో ఏదైనా పెద్దగా సాధించాలని తపనతో గణేష్ డాక్టర్ కావాలని అనుకున్నారు. ఇక డాక్టర్ అయ్యేందుకు తన ప్రయాణం అంత సాఫీగా అయితే ముందుకు సాగలేదు. దానికోసం ఎంతో శ్రమించారని చెప్పాలి. ఎంతో శ్రమించి చివరికి అనుకున్నది సాధించాడు. అయితే గణేష్ ఎంబిబిఎస్ సీట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు నువ్వు మూడు అడుగులు ఎత్తు ఉన్నావు. ఎమర్జెన్సీ కేసుల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమిటీ గణేష్ దరఖాస్తును తిరస్కరించిందట. ఇక ఈ విషయాన్ని తన టెన్త్ క్లాస్ ప్రిన్సిపల్ తో గణేష్ చెప్పాడట. అయితే గణేష్ దరఖాస్తును తిరస్కరించడానికి స్పష్టమైన కారణాలు చెప్పాలంటూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయమని అప్పటి భాగ్ నగర్ కలెక్టర్ హర్షద్ పటేల్ సలహా ఇచ్చారట. ఇక హైకోర్టులో పిటిషన్ వేయడానికి ప్రిన్సిపల్ మరియు హర్షద్ పటేల్ గణేష్ కు సహకరించారట.

కానీ వారి పిటిషన్ వేసిన కోర్టులో కేసు ఓడిపోవడంతో గణేష్ పూర్తిగా కృంగిపోవడం జరిగింది. అయితే హైకోర్టులో కేసు ఓడిపోయానని విశ్రమించకుండా మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడుదామని గణేష్ ప్రయత్నించారు. ఇక సుప్రీంకోర్టు 2018 అక్టోబర్ 2న ఎంబిబిఎస్ లో గణేష్ కూడా ప్రవేశం పొందవచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే అప్పటికే 2018 ఎంబిబిఎస్ బ్యాచ్ కంప్లీట్ అయిపోవడంతో 2019లో తిరిగి జాయిన్ కావచ్చు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ విధంగా తాను అనుకున్నది సాధించే దిశగా గణేష్ అడుగులు వేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు గణేష్ కేవలం భారత దేశంలో కాకుండా ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు కలిగిన డాక్టర్. అయితే గణేష్ తాను సాధించిన పలు రకాల పనులకు గాను సత్కారాలు కూడా అందుకున్నాడు. తాను అనుకున్నది సాధించేందుకు గణేష్ ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. ప్రయత్నిస్తే సాధించలేని అంటూ ఏదీ లేదని గణేష్ చేసి చూపించాడు. మరి ఈ గణేష్ స్టోరీ ఎంతోమందికి ఆదర్శనీయమని చెప్పాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Also read

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది