Food Delivery : రెండేళ్ల కూతురి తో డెలివరీ ఏజెంట్ ఫుడ్ డెలివరీ.. స్టోరీ చదివితే కన్నీరు ఆగదు
Food Delivery : గుర్గావ్‌లో పంకజ్ అనే స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. రోజూ పంకజ్ తన టూ వీలర్‌పై ఫుడ్ డెలివరీ చేస్తుంటాడు.కేవలం ఇతడొక్కడే కాదు ఇతడి కూతురు కూడా ఉంటుంది. ఆ చిన్నారి వయస్సు కేవలం రెండు సంవత్సరాలు. దింట్లో ఏముంది అనుకుంటున్నారా..?
Food Delivery : ఈ స్టోరీ మొత్తం చదవండి.
గుర్గావ్‌కు చెందిన ఓ కంపెనీ సీఈఓ మాయాంక్ అగర్వాల్, స్విగ్గీ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశాడు పంకజ్. ఫోన్ కాల్ సమయంలో చిన్న పిల్లల గొంతు అగర్వాల్‌కి వినిపించింది. ఆసక్తిగా మీతో చిన్న పిల్లలు ఉన్నారా? అని పంకజ్‌ని ప్రశ్నించాడు. అవుననే సమాధానం రావడంతో పంకజ్‌ని కలవాలని ఆసక్తిగా కిందకు వెళ్లాడు. పంకజ్ టూ వీలర్‌ని ఆపి సైలెంట్‌గా కూర్చుని ఉన్నాడు. ముందు వైపు అతని కుమార్తె తున్ తున్ ఉంది. వర్క్ చేస్తున్నప్పుడు కుమార్తెను ఎందుకు తీసుకొచ్చావని అగర్వాల్ అడిగాడు. అప్పుడు పంకజ్ తన కథను చెప్పుకొచ్చాడు.

Food Delivery : రెండేళ్ల కూతురి తో డెలివరీ ఏజెంట్ ఫుడ్ డెలివరీ.. స్టోరీ చదివితే కన్నీరు ఆగదు
అతని భార్య ప్రసవం సమయంలో చనిపోయింది. అతని పెద్ద కొడుకు ఈవెనింగ్ క్లాసెస్‌కి హాజరవుతున్నాడు. కాబట్టి తున్ తున్‌ను చూసుకునే వారు ఎవరూ లేరు. అందుకే ఫుడ్ డెలివరీ సమయంలో పంకజ్ తన కుమార్తెను కూడా తీసుకొస్తున్న అని చెప్పాడు. ఈ విషయాన్నీ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ‘స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్ మిస్టర్ పంకజ్ తన పసిబిడ్డతోనే వర్క్ చేస్తున్నాడు. ఎందుకంటే అతనికి వేరే మార్గం లేదు. పిల్లల సంరక్షణ లేదు. భద్రత లేదు. నిజమైన తండ్రి ప్రేమ మాత్రమే ఉంది’ అని పోస్ట్‌లో షేర్ చేశాడు. అంతే ఈ పోస్ట్ కు ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతూ రిప్లయ్ లు ఇస్తున్నారు.