Inspirational Story : తాగుబోతు భర్తని ప్రభుత్వ ఉద్యోగిగా మార్చిన భార్య…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Inspirational Story : తాగుబోతు భర్తని ప్రభుత్వ ఉద్యోగిగా మార్చిన భార్య…!

Inspirational Story : ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ వింటే కచ్చితంగా సినిమా స్క్రిప్ట్ అనక మానరు. ఎందుకంటే ఈ కథ అలా ఉంటుంది మరి. ఇక అసలు విషయంలోకి వెళ్ళినట్లయితే ఓ విద్యార్థి 2000 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఇంటర్ , డిగ్రీ, పీజీ , బీఈడీ వరుసగా అగ్రస్థానాలలో ఉత్తీర్ణత సాధించాడు. అయితే ఈ విద్యార్థి ప్రతిభ చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 March 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Inspirational Story : తాగుబోతు భర్తని ప్రభుత్వ ఉద్యోగిగా మార్చిన భార్య...!

Inspirational Story : ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ వింటే కచ్చితంగా సినిమా స్క్రిప్ట్ అనక మానరు. ఎందుకంటే ఈ కథ అలా ఉంటుంది మరి. ఇక అసలు విషయంలోకి వెళ్ళినట్లయితే ఓ విద్యార్థి 2000 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఇంటర్ , డిగ్రీ, పీజీ , బీఈడీ వరుసగా అగ్రస్థానాలలో ఉత్తీర్ణత సాధించాడు. అయితే ఈ విద్యార్థి ప్రతిభ చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని భావించారు. కానీ ఇక్కడ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లుగా ఆ విద్యార్థికి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్న ఆవ గింజ అంత అదృష్టం కరువైందని చెప్పాలి. ఏ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసిన ఒకటి లేదా అరమార్కు తేడాతో పోయేవి. దీనికి తోడు అతను అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి కావడంతో రిజర్వేషన్ కూడా కలిసి రాలేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదుల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోయాయి. అసలే పేద కుటుంబం పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి స్తోమత లేకపోవడంతో ప్రైవేట్ టీచర్ గా ఉద్యోగంలో చేరాడు. ప్రభుత్వ ఉద్యోగం రాక మనస్థాపం ఒకవైపు నేనే ఇంత చదివిన ఉద్యోగం తెచ్చుకోలేకపోయా నేను నా విద్యార్థులకు న్యాయం చేయగలనా అనే కుంగుబాటుతనం మరోవైపు. దీంతో అతను ప్రైవేట్ టీచర్ గా కూడా చేయలేకపోయాడు. ఆ విధంగా నిస్పృహకు లోనైనా ఆ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే తనకు ఉన్న ఆస్తిని కూడా మొత్తం అమ్మేశాడు. అంతలా దిగజారిపోయిన ఆ వ్యక్తిని ఊరు వాడంతా చదువుకున్న తాగుబోతు అంటూ పిలవడం మొదలుపెట్టారు.

ఇక నా జీవితం ఇంతే అని బాధపడుతున్న ఆ వ్యక్తి జీవితంలోకి తన మరదలు వెలుగుల ప్రవేశించింది అని చెప్పాలి. ఊరు వాడ చుట్టాలు పక్కాలు తాగుబోతుని పెళ్లి చేసుకుని ఏం చేస్తావని నిలదీసిన వినిపించుకోకుండా అతనిని పెళ్లి చేసుకుంది. ఆమెకు తన బావపై ఉన్న ప్రేమ ముందు సూటిపోటు మాటలు నిలవలేకపోయాయి. పెళ్లి చేసుకున్న తర్వాత తన దగ్గర ఉన్న బంగారం అంతా కొదవ పెట్టి తన బావకు ఆటో కొనిచ్చింది. నెమ్మదిగా తన బావను మద్యానికి దూరం చేయడం ప్రారంభించింది. ఆ విధంగా ఆటో నడుపుతూ జీవితం కొనసాగిస్తున్న ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. ఈ విధంగా వారి జీవితం అంతా సజావుగా సాగుతున్న సమయంలో తన పిల్లల్ని ఎవరైనా మీ తండ్రి ఏం చేస్తాడు అని అడిగితే ఆటో డ్రైవర్ అని చెప్పడం చూసి చలించిపోయిన ఆ ఇల్లాలు తన బావ స్థాయి ఇది కాదని ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ చేయాల్సిందిగా తన బావ ని కోరింది. తన బావ ఎలాగైనా ఉన్నత స్థానంలో నిలుస్తాడని ఆమె బలమైన నమ్మకం. ఇక అదే సమయానికి గురుకుల పాఠశాల నియామక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించిన ఇల్లాలు తన బావను తిరిగి చదవమని కోరింది.

Inspirational Story తాగుబోతు భర్తని ప్రభుత్వ ఉద్యోగిగా మార్చిన భార్య

Inspirational Story : తాగుబోతు భర్తని ప్రభుత్వ ఉద్యోగిగా మార్చిన భార్య…!

అయితే భార్య మాటలు విన్న భర్త షాక్ అయ్యాడు. మనం ఉన్న పరిస్థితి ఏంటి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మనది ఒక పూట ఆటో ఇంటి దగ్గరుంటే అవసరాలకు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుందని కుదరదు అని చెప్పాడు. అయినా తన భార్య వినకుండా మొండిగా వెంటపడింది. చివరికి ఏదో ఒక రకంగా తన భర్తను ఒప్పించగలిగింది. తాను ప్రైవేట్ గా ఉద్యోగం చేస్తూ ఉన్న ఆటో అమ్మి మూడు నెలలకు సరిపడా సరుకులను తీసుకువచ్చింది. తన భర్తకు పూర్తి స్వేచ్ఛ నిచ్చి తన కాన్సన్ట్రేషన్ మొత్తం చదువుపై పెట్టెల చేసింది. అయితే తన జీవితంలో ఇదే చిట్టచివరి అవకాశం గా భావించిన భర్త కసిగా చదివి ప్రభుత్వ ఉద్యోగ సాధించాడు. ఇక ఈ దంపతులు ప్రస్తుతం ఎంతమందికి ఆదర్శమని చెప్పాలి. మరి వారి గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి కింద వీడియోని పూర్తిగా చూడండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది