Agri Diploma : 2 ఏళ్లు చదివితే చాలు లైఫ్ సెటిల్ అయ్యే ఈ కోర్స్ గురించి మీకు తెలుసా..?
ప్రధానాంశాలు:
Agri Diploma : 2 ఏళ్లు చదివితే చాలు లైఫ్ సెటిల్ అయ్యే ఈ కోర్స్ గురించి మీకు తెలుసా..?
Agri Diploma : టెంత్ పాస్ అయిన తర్వాత చాలా మంది చదువు ఆపేసి ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకుంటారు. కుటుంబ ఆర్ధిక పరిస్థితి వల్ల కొదరు చదువు కొనసాగించలేరు. ఐతే పాటెక్నికల్ కాలేజ్ లో చేరి కొందరు డిప్లమా చేస్తారు. ఐతే పాలిటెక్నికల్ తో పాటు అగ్రి కల్చరల్ డిప్లమా చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పది పాసై వారికి ఇది మంచి అవకాశం. వ్యవసాయం లో పాలిటెక్నిక్ చేస్తే నూతన పద్ధతిలో కొత్త పంటలు, అధిక దిగుబడి ఇచ్చే పంఠలు పెట్టుకుబడి తక్కువతో ఎక్కువ లాభం ఇచ్చే పంఠల గురించి తెలుసుకోవచ్చు. పంఠల సాగు మెళుకువలు కూడా తెలుసుకోవచ్చు. నివాసం ఉన్న చోటే మరో పది మందికి ఉపాధి కల్గించే సౌకర్యం ఉంటుంది. ఇప్పటికే కొన్ని వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ లకు ప్రవేశాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 3 వరకు మాత్రమే చివరి తేడీ ఉన్నట్టు తెలుస్తుంది.
Agri Diploma : ఆగ్రికల్చర్ డిప్లొమా వల్ల లాభాలు..
పది పాసైన వారు ఇంటర్ ఫెయిల్ అయ్యి మధ్యలో చదువు ఆపిన వారు ఎవరైనా దీనికి అర్హుఏ. ఐతే దీనికి వయసు 18 నుంచి 22 ఏళ్ల లోపు వయసు ఉన్న వారే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ అనుబంధ పరిధిలో ఈ సీట్లు ఫిల్ చేస్తున్నారు. అగ్రికల్చర్ డిప్లొమా వల్ల పంటల నిర్వహణతో పాటుగా సరైన వ్యవసాయ పద్ధతులు వ్యవసాయ విస్తరణ గురించి అవగాహన కలిగించేలా క్లాసులు ఉంటాయి. రెండు సంవత్సరాల కోర్సులో ఎన్నో వ్యవసాయానికి సంబందించిన విషయాలను చెబుతారు. ప్రస్తుతం డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చదవడానికి ఎవరైనా రీజన్స్ అడిగితే.. వారికి దేశానికి మంచి వ్యవసాయ పరిజ్ఞానం అందించడం కోసమని చెప్పొచ్చు.
దేశంలోని రైతుల అభ్యున్నతి కోసం ఏదైనా చేయగల నిపుణులను తయారు చేయాలని చూస్తున్నారు. అందుకే ఈ కోర్స్ ఇస్తున్నారు. ఈ డిప్లమా చేసిన వారికి వివిధ రంగాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి. కోర్స్ పూర్తైన తర్వాత అభ్యర్ధులు వ్యవసాయ రంగంలో పనిచేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధిని పొందే అవకాశం ఉంటుంది. ఈ కోర్స్ చేసిన వారికి అగ్రికల్చరల్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్, మల్టీ పర్పస్ ఎక్స్ టెన్ష ఆఫీసర్,రైతు భోర్సా కేంద్రాల అసిస్టెంట్ పోస్టులకు అర్హత పొందుతారు.