AP Anganwadi Jobs 2024 : అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఈ నెల 21 దరఖాస్తుకు అవకాశం
AP Anganwadi Jobs 2024 : 10వ తరగతి ఉత్తీర్ణులై స్థానికంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త. తాజాగా ఏపీ చిత్తూరు జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఐసీడీఎస్ పీడీ నాగశైలజ వెల్లడించారు. పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండలంలో 2 హెల్పర్ పోస్టులు కలవు. పాపేపల్లి, గాండ్లపల్లి ఈ రెండు గ్రామాల్లో కలవు. పలమనేరు మండలంలో 2 కలవు. గంగవరం, బైరెడ్డిపల్లి.. పుంగనూరు […]
ప్రధానాంశాలు:
AP Anganwadi Jobs 2024 : అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఈ నెల 21 దరఖాస్తుకు అవకాశం
AP Anganwadi Jobs 2024 : 10వ తరగతి ఉత్తీర్ణులై స్థానికంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త. తాజాగా ఏపీ చిత్తూరు జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఐసీడీఎస్ పీడీ నాగశైలజ వెల్లడించారు. పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండలంలో 2 హెల్పర్ పోస్టులు కలవు. పాపేపల్లి, గాండ్లపల్లి ఈ రెండు గ్రామాల్లో కలవు. పలమనేరు మండలంలో 2 కలవు. గంగవరం, బైరెడ్డిపల్లి.. పుంగనూరు మండల పరిధిలోని అరడి గుంట, రామ్ నగర్ లో కలవు. అంగన్‌వాడీ కేంద్రం, గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ఉన్న స్థానిక మహిళలు పదో తరగతి ఉత్తీర్ణత చెందిన వారు, రోస్టర్ ను అనుసరించి సంబంధిత సీడీపీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
AP Anganwadi Jobs 2024 ముఖ్య సమాచారం
మొత్తం అంగన్‌వాడీ పోస్టుల సంఖ్య : 55 (అంగన్‌వాడీ కార్యకర్తలు -6, మినీ కార్యకర్తలు -12, హెల్పర్లు -37)
అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. స్థానిక ప్రాంత పరిధికి చెందిన మహిళ అయి ఉండాలి.
వయస్సు : దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థి వయసు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు నిండినవారు లేకపోతే, 18 ఏళ్ల నిండిన వారిని కూడా తీసుకుంటారు.
దరఖాస్తు ప్రారంభం తేదీ : సెప్టెంబర్ 12 నుంచి
దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 21 (సాయంత్రం 5 గంటల లోపు ) దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం : ఎలాంటి పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభా ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
దరఖాస్తు విధానం
దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లోనే చేసుకోవాలి. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి. అర్హత గల వారు దగ్గరిలోని సీడీపీఓ కార్యాలయంలోనే అప్లికేషన్ తీసుకొని, దాన్ని పూర్తి చేసి అన్ని రకాల ధ్రువపత్రాలను జత చేసి వారికి అందజేయాలి. అందజేయాల్సిన ధ్రువపత్రాల విషయానికొస్తే.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పుట్టిన తేదీ, వయస్సు ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, 10వ తరగతి మార్కుల జాబితా, నివాస స్థల ధ్రువీకరణ పత్రం, వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం, వికలాంగురాలైతే పీహెచ్ సర్టిఫికేట్, వితంతువు అయి పిల్లలు ఉన్నట్లు అయితే పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీలను దరఖాస్తుకు జత చేసి అందజేయాల్సి ఉంటుంది.