Good News : నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన ఏపీ ప్రభుత్వం!
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించటమే ముఖ్య ఉద్దేశంగా బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీంను అందిస్తోంది. పదవ తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారితో పాటు మధ్యలో చదువు ఆపేసిన వారు కూడా ఈ పథకానికి అర్హులుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

AP government has given good news to the unemployed
అర్హులైన వారిని గుర్తించడం కోసం ప్రభుత్వం కౌశలం పేరుతో సర్వేను ప్రారంభించింది. మొదట సచివాలయ సిబ్బంది ఈ సర్వేను నిర్వహించారు. ప్రస్తుతం అభ్యర్థులు నేరుగా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకునేందుకు కల్పించారు. కౌన్సిలింగ్ ద్వారా సర్వేలో గుర్తించిన నిరుద్యోగ అభ్యర్థులు వర్క్ ఫ్రం హోం జాబ్ పొందడం కోసం https://gsws-nbm.ap.gov.in/BM/ వెబ్సైట్లో వివరాలను నమోదు చేయాలి.
ఆన్ లైన్ లో దరఖాస్తులు ఇలా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా వెబ్సైట్లోకి వెళ్లి అందులో బెనిఫీషియరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేజ్ లోకి వెళ్లి వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆధార్ ద్వారా గుర్తింపు ధ్రువీకరించిన తర్వాత ఒక దరఖాస్తు ఫాం కనిపిస్తుంది. ఆ ఫామ్ లో ఫోన్ నెంబర్, ఇమెయిల్ లకు వచ్చిన ఓటీపీ ల ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాలి. 64 వేల మంది ఈ పథకం పొందడం కోసం దరఖాస్తు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తదితర వివరాలను అందులో నమోదు చేయాలి. ఆ ఫామ్ లో అడిగిన అన్ని వివరాలను అప్లోడ్ చేసిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 64 వేల మంది ఈ పథకం పొందడం కోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా కంప్యూటర్, మొబైల్ వంటి సాధనాలతో ఇళ్ల వద్ద నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయవచ్చు.
బెనిఫీషియరీ మేనేజ్మెంట్ పోర్టల్ నిరుద్యోగుల కోసమే అభ్యర్థుల క్వాలిఫికేషన్ కు తగ్గట్టుగా ఉపాధి కల్పించి, సరైన వేతనం అందించేలా చూడడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం అందిస్తున్న ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కు దరఖాస్తు చేసుకొని ఇళ్ళ నుండే పనిచేసే అవకాశాన్ని పొందాలనుకుంటే మరెందుకు ఆలస్యం బెనిఫీషియరీ మేనేజ్మెంట్ పోర్టల్ లో లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోండి.