AP TET హాల్ టికెట్ 2024, CBT పరీక్ష షెడ్యూల్, పేపర్ నమూనా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP TET హాల్ టికెట్ 2024, CBT పరీక్ష షెడ్యూల్, పేపర్ నమూనా..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 September 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  AP TET హాల్ టికెట్ 2024, CBT పరీక్ష షెడ్యూల్, పేపర్ నమూనా..!

AP TET : ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ తన అధికారిక వెబ్‌పేజీలో AP TET హాల్ టికెట్ 2024 లభ్యతను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 కోసం నమోదు చేసుకున్న వ్యక్తులు పోర్టల్ సైన్-ఇన్ విభాగం ద్వారా వారి రిజిస్ట్రేషన్ వివరాలను అందించి అడ్మిట్ కార్డ్‌లను పొంద‌వ‌చ్చు. అభ్య‌ర్థులు అడ్మిట్ కార్డ్ ప్రింటెడ్ కాపీ, ఒక ID ప్రూఫ్‌ని పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లాలి. AP TET కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE). పరీక్ష వ్య‌వ‌ధి 2 గంటల 30 నిమిషాలు. నెగిటీవ్ మార్కులు లేవు.

పరీక్ష తేదీ : 03 నుండి 20 అక్టోబర్ 2024
అడ్మిట్ కార్డ్ లభ్యత : పరీక్ష తేదీకి 7 రోజుల ముందు
అధికారిక వెబ్‌సైట్ : aptet.apcfss.in

అభ్యర్థులు aptet.apcfss.in లాగిన్ అయి వినియోగదారు ID, పుట్టిన తేదీ (dd/mm/yyyy ఫార్మాట్‌లో) మరియు క్యాప్చా కోడ్‌ల కలయికను నమోదు చేయడం ద్వారా వారి ప్రవేశ ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు.

AP TET టెట వెయిటేజీ ఎంత ?

గురుకుల/ టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (డీఎస్‌సీ)లో టెట్‌కు 20 శాతం మార్కులు వెయిటేజీ ఇస్తారు. కాబట్టి గతంలో టెట్‌ రాసిన అభ్యర్థులు మార్కులు పెంచుకునేందుకు మళ్లీ టెట్ రాస్తే మంచిది. టెట్‌లో తెచ్చుకున్న ప్రతి 15 మార్కులకూ 2 మార్కుల వెయిటేజీ ఉంటుంది. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్‌కు జీవితకాలం చెల్లుబాటు ఉంటుంది.

ప‌రీక్ష సన్నద్ధత :

చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి..
– ఇందులో కీలకమైన మూడు విభాగాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. మొదటి యూనిట్‌ శిశువికాసం. ఇందులో వికాస దశలు, వికాస సిద్ధాంతాలు, వైయక్తిక భేదాలు కన్పించే అంశాలైన ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, వైఖరులు, అభిరుచులు, సృజనాత్మకత, ఆలోచన, మూర్తిమత్వం, మానసిక ఆరోగ్యం-శిశు అధ్యయన పద్ధతులను చదవాలి.
– చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజిలో అభ్యసనం (లెర్నింగ్‌) యూనిట్‌లో ప్రధాన అంశాలైన అభ్యసనా సిద్ధాంతాలు, అభ్యసన బదలాయింపు, ప్రేరణ, అభ్యసన అంగాలు, స్మృతి-విస్మృతిపై ఎక్కువగా దృష్టి పెట్టి చదవాలి.
– అధ్యాపన శాస్త్రం (పెడగాజి)లో కీలకమైన సహిత విద్య, బోధన దశలు, బోధన ఉపగమాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం (2009), జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం (2005)పై దృష్టి పెట్టి చదవాలి.

లాంగ్వేజెస్‌..
– లాంగ్వేజ్‌-1, లాంగ్వేజ్‌-2లకు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాల్లోని వ్యాకరణ అంశాలు, వాటి ఉదాహరణలు బాగా చదవాలి. సిలబస్‌లో ఇచ్చిన సాహిత్యం అవగాహన చేసుకోవాలి.

AP TET హాల్ టికెట్ 2024 CBT పరీక్ష షెడ్యూల్ పేపర్ నమూనా

AP TET హాల్ టికెట్ 2024, CBT పరీక్ష షెడ్యూల్, పేపర్ నమూనా..!

AP TET కంటెంట్‌ ఎలా చదవాలి?

– పేపర్‌-1 అభ్యర్థులు గణితం, విజ్ఞానశాస్త్రం, సాంఘికశాస్త్రం కంటెంట్‌ను ప్రాథమిక స్థాయి తరగతుల పాఠ్యపుస్తకాలు చదవాలి. పేపర్‌-2 అభ్యర్థులు 10వ తరగతి వరకు కంటెంట్‌ చదవాలి. తెలుగు అకాడమీ లాంటి ప్రామాణికమైన సంస్థల ప్రచురణలను చదువుతూ సొంతంగా నోట్సు తయారుచేసుకోవడం మంచిది.
– గణితం కంటెంట్‌లో అరిథ్‌మెటిక్, సంఖ్యా వ్యవస్థ, రేఖాగణితం, క్షేత్రమితి, బీజగణితం, దత్తాంశ నిర్వహణ యూనిట్లపై దృష్టి పెట్టాలి.
– సైన్స్‌ కంటెంట్‌లో సజీవ ప్రపంచం, జీవప్రక్రియలు, సహజ దృగ్విషయాలు, మన పర్యావరణం యూనిట్లు బాగా చదవాలి.
– సోషల్‌ స్టడీస్‌ కంటెంట్‌లో 6 థీమ్‌లు ఉన్నాయి. 1. భూమి వైవిధ్యం- మాన చిత్రాలు 2. ఉత్పత్తి-వినిమయం, జీవనాధారాలు 3.రాజకీయ వ్యవస్థలు-పరిపాలన 4.సామాజిక వ్యవస్థీకరణ – అసమానతలు 5.మతం-సమాజం 6. సంస్కృతి విభాగాలను అధ్యయనం చేయాలి.
– కంటెంట్‌ చదివేటప్పుడు 3, 4, 5 తరగతులకు రాసిన పాఠ్యాంశం, ఎక్కువ తరగతులు 6, 7, 8, 9, 10లో పునరావృతం అయినప్పుడు ఒకేసారి చదివి భావనలను అర్థం చేసుకోవాలి. నోట్సు రాసుకోవాలి. అంతేగానీ బట్టీ పద్ధతిలో చదవకూడదు.
– చదవటంతోపాటు పదేపదే పునశ్చరణ చేయడం, చదివింది చూడకుండా గుర్తుకు తెచ్చుకోవడం ముఖ్యం.
– కఠినమైన అంశాలను స్నేహితులు, బోధన నిపుణులతో చర్చించి అవగాహన పెంచుకోవాలి.
– గత టెట్‌ ప్రశ్నపత్రాల సాధన ద్వారా టెట్‌లో మంచి మార్కులను సాధించవచ్చు.
– తెలుగు అకాడమీ లాంటి ప్రామాణిక సంస్థల ప్రచురణలను చదువుతూ సొంతంగా నోట్సు తయారుచేసుకోవడం మంచిది.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది