Good News : యువకులకు గుడ్‌న్యూస్.. 400 పోస్టులకు ఇంటర్వ్యూలు జీతం ఎంతో తెలుసా..?
ప్రధానాంశాలు:
Good News : యువకులకు గుడ్‌న్యూస్.. 400 పోస్టులకు ఇంటర్వ్యూలు జీతం ఎంతో తెలుసా..?
Good News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరంగా వెలుగొందుతున్న విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఐటీ, ఫార్మా, షిప్‌యార్డ్, స్టీల్ ప్లాంట్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలైన APITA, APSSDC, ఆంధ్ర స్కిల్ యూనివర్సిటీలు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టి క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంప్లాయిస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (UEIGB), నేషన్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన ఉదయం 10:30 గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Good News : యువకులకు గుడ్‌న్యూస్.. 400 పోస్టులకు ఇంటర్వ్యూలు జీతం ఎంతో తెలుసా..?
Good News : 400 పోస్టులకు ఇంటర్వ్యూలు జీతం ఎంతో తెలుసా
ఈ జాబ్ మేళాలో 6 ప్రముఖ సంస్థలు కలసి 400 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు UEIGB డిప్యూటీ చీఫ్ కె. దొరబాబు తెలిపారు. అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, తుని సహా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని పిలుపునిచ్చారు. పదో తరగతి నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, డిప్లొమా, ఐటీఐ, బీఫార్మసీ, డీఫార్మసీ, ఎంఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు విద్యార్హతల ఆధారంగా నెలవారీ జీతం రూ.10,000 నుండి రూ.30,000 వరకు లభిస్తుంది.
18 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగులు జూలై 9న ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని యుఈఐజీబీ విభాగానికి ఉదయం 10:30కి హాజరు కావాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాలకు 9666092491, 9100832168, లేదా 0891-2844484 నెంబర్లలో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారి భవిష్యత్తుకు పునాదులు వేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు