Dsc : 2678 పోస్టులు ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం.. ఎలా అప్లై చేసుకోవాలి అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dsc : 2678 పోస్టులు ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం.. ఎలా అప్లై చేసుకోవాలి అంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :1 September 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Dsc : 2678 పోస్టులు ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం.. ఎలా అప్లై చేసుకోవాలి అంటే..!

Dsc : ఎప్పటిక‌ప్పుడు నిరుద్యోగుల‌కి ఉద్యోగాలు ప్ర‌క‌టిస్తూ వారిలో ఆనందం నింపుతున్నాయి ప్ర‌భుత్వాలు.ఉమ్మడి కర్నూలు జిల్లా డీఎస్సీ అభ్యర్థుల కోసం జిల్లాలోని షెడ్యూల్డు తెగలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు డీఎస్సీ పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇచ్చేందుకు ఆయా సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా గిరిజన సాంఘీకసంక్షేమాధికారిణి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు. ఎన్నిక‌ల హామీ ప్ర‌కారం కూట‌మి ప్ర‌భుత్వం ఈ ప్ర‌క‌ట‌న చేసింది. అయితే గ‌త 10 సంవ‌త్స‌రాల నుండి ఎలాంటి నోటిఫికేష‌న్ లేదు.ఈ స‌మ‌యంలో ఇది శుభ‌వార్త అనే చెప్పాలి.

Dsc గుడ్ న్యూస్..

ఇక మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలో మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జులై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ షురూ చేసి డిసెంబర్ 10లోగా పరీక్షలు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముందుగా టెట్ పరీక్ష నిర్వహించిన,ప్రభుత్వం ఆ తర్వాత మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారట. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం చేసి శిక్షణ సైతం ప్రారంభించింది. కర్నూలు జిల్లాలో వంద మంది గిరిజన అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమాధికారిణి జే.రంగలక్ష్మిదేవి తెలిపారు.

Dsc 2678 పోస్టులు ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం ఎలా అప్లై చేసుకోవాలి అంటే

Dsc : 2678 పోస్టులు ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం.. ఎలా అప్లై చేసుకోవాలి అంటే..!

సొసైటీల చట్టం/ ట్రస్ట్/ ప్రొప్రైటరీ ఫర్మ్ కింద నమోదై ఐదేళ్ల నుంచి డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఉత్తమ ఫలితాలు సాధించిన శిక్షణా సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన అభ్యర్థులను ఆయా సంస్థలకు కేటాయిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీలోగా కర్నూలు పట్టణం లోని బిర్లా గేట్ సమీపంలో ఉన్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం పనివేళల్లో సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కార్యాలయం లేదా 94910 23041 అనే నెంబ‌ర్‌కి కాల్ చేయాల‌ని తెలిపారు. ఇటీవల వెలువడిన నోటిఫికేషన్ లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే 2678 టీచర్ పోస్టులు ఉన్నాయని ప్ర‌తి ఒక్క‌రు దీనిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని తెలిపారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది