Meesho Jobs : నిరుద్యోగుల‌కు ఈ-కామ‌ర్స్ దిగ్గజం మీషో Meesho బంప‌ర్ ఆఫ‌ర్‌.. 8.5 లక్షల ఉద్యోగాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Meesho Jobs : నిరుద్యోగుల‌కు ఈ-కామ‌ర్స్ దిగ్గజం మీషో Meesho బంప‌ర్ ఆఫ‌ర్‌.. 8.5 లక్షల ఉద్యోగాలు

Meesho Jobs : ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ మీషో(Meesho) లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో పండుగ సీజన్‌లో 8.5 లక్షల సీజనల్ ఉద్యోగాలను ప్రారంభించింది. ఎక్కువగా టైర్-3 మరియు టైర్-4 రీజియన్‌లలో ఈ ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రుగ‌నున్న‌ట్లు తెలిపింది. కంపెనీ ప్రకటన ప్రకారం, ఇది గత ఏడాదితో పోలిస్తే 70 శాతం అధికమ‌ని పేర్కొంది. సౌరభ్ పాండే, CXO, ఫిల్‌మెంట్ అండ్ ఎక్స్‌పీరియన్స్, మీషో స్పందిస్తూ.. ఈ పండుగల సీజన్‌లో ముఖ్యంగా టైర్-3 మరియు అంతకు మించి నగరాల్లో 8.5 లక్షల […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 September 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Meesho Jobs : నిరుద్యోగుల‌కు ఈ-కామ‌ర్స్ దిగ్గజం మీషో Meesho బంప‌ర్ ఆఫ‌ర్‌.. 8.5 లక్షల ఉద్యోగాలు

Meesho Jobs : ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ మీషో(Meesho) లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో పండుగ సీజన్‌లో 8.5 లక్షల సీజనల్ ఉద్యోగాలను ప్రారంభించింది. ఎక్కువగా టైర్-3 మరియు టైర్-4 రీజియన్‌లలో ఈ ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రుగ‌నున్న‌ట్లు తెలిపింది. కంపెనీ ప్రకటన ప్రకారం, ఇది గత ఏడాదితో పోలిస్తే 70 శాతం అధికమ‌ని పేర్కొంది. సౌరభ్ పాండే, CXO, ఫిల్‌మెంట్ అండ్ ఎక్స్‌పీరియన్స్, మీషో స్పందిస్తూ.. ఈ పండుగల సీజన్‌లో ముఖ్యంగా టైర్-3 మరియు అంతకు మించి నగరాల్లో 8.5 లక్షల సీజనల్ ఉద్యోగాలను ప్రారంభించినందుకు తాము చాలా సంతోషిస్తున్న‌ట్లు తెలిపారు.

SMBలు, స్థానిక తయారీదారులు మరియు లాజిస్టిక్స్ ప్రొవైడర్లు తమ వ్యాపారాన్ని స్కేల్ చేసుకునేందుకు సాధికారత కల్పించడం వల్ల అర్థవంతమైన ఆర్థిక అవకాశాలు లభిస్తాయ‌ని అన్నారు. మీషో అమ్మకందారులు పండుగ సీజన్‌లో తమ అవసరాలలో భాగంగా 5 లక్షల మంది సీజనల్ కార్మికులను నియమించుకుంటున్న‌ట్లు తెలిపింది.

Meesho Jobs నిరుద్యోగుల‌కు ఈ కామ‌ర్స్ దిగ్గజం మీషో Meesho బంప‌ర్ ఆఫ‌ర్‌ 85 లక్షల ఉద్యోగాలు

Meesho Jobs : నిరుద్యోగుల‌కు ఈ-కామ‌ర్స్ దిగ్గజం మీషో Meesho బంప‌ర్ ఆఫ‌ర్‌.. 8.5 లక్షల ఉద్యోగాలు

అదనంగా, మీషో దాని స్వంత లాజిస్టిక్ వర్టికల్ వాల్మోతో పాటు ఢిల్లీవేరీ, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, షాడోఫాక్స్ మరియు ఎక్స్‌ప్రెస్‌బీస్‌తో సహా దాని థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్ల ద్వారా దాదాపు 3.5 లక్షల మంది గిగ్ వర్కర్లను నియమించుకుంది. వీటిలో 60 శాతానికి పైగా టైర్ 3, టైర్ 4 ప్రాంతాల నుంచి వస్తున్నాయని పేర్కొంది. ఈ ఉద్యోగాలు ఎక్కువగా ఫస్ట్-మైల్, మిడిల్-మైల్ మరియు డెలివరీ అసోసియేట్‌లను కలిగి ఉంటాయి. పికింగ్, సార్టింగ్, లోడ్ చేయడం, అన్‌లోడ్ చేయడం మరియు రిటర్న్‌లను నిర్వహించడం వంటి విధులకు బాధ్యత వహిస్తారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది