Nursing Jobs : నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో ఉద్యోగం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
ప్రధానాంశాలు:
Nursing Jobs : నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో ఉద్యోగం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
Nursing Jobs : జనరల్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, మిడ్ వైఫరీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వసతులతో కూడిన జాబ్, ప్రారంభంలోనే మంచి ప్యాకేజీ, అనుభవం రాగానే అద్భుతమైన శాలరీ పొందే అవకాశాలు. కానీ దరఖాస్తుకు చివరి తేదీ నేడే. ఏపీలోని తిరుపతి పట్టణంలో జర్మనీలో నర్సింగ్ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. చెన్నైకి చెందిన ఎస్ఎం కేర్ సొల్యూషన్స్ సీఈఓ నటరాజన్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి లోకనాథం శిక్షణ తరగతులను ప్రారంభించారు.
అర్హులైన యువతకు జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు చెప్పారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. జర్మన్ భాషపై ఆరు నెలలపాటు ఏ1, ఏ2, బీ1, బీ2 స్థాయిలో శిక్షణ ఉంటుందన్నారు. స్విమ్స్ నర్సింగ్ కాలేజీలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారత కరెన్సీలో సుమారు రూ.2,33,000 నుంచి రూ.3,26,000 వరకు వేతనం లభిస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు.
ఆసక్తి ఉన్నవారు https://forms.gle/ZfujgtBSwXPUMgY8 వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి skilliter- national @apssdc.in రెస్యూమ్ పంపించాలన్నారు. వివరాల కోసం 99888 53335 సంప్రదించాలని సూచించారు.