Revanth Reddy : 56 వేల ఉద్యోగల భర్తీకి రేవంత్ ప్లాన్.. ఏ శాఖల్లో ఎన్ని ఉన్నాయంటే..!
ప్రధానాంశాలు:
Revanth Reddy : 56 వేల ఉద్యోగల భర్తీకి రేవంత్ ప్లాన్.. ఏ శాఖల్లో ఎన్ని ఉన్నాయంటే..!
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఇటీవల జరిగిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ప్రభుత్వం వివిధ శాఖల ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ల జారీకి రంగం సిద్ధం చేసింది. మొత్తం 56,740కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తాజా లెక్కలతో స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో మొదటి విడతలో 18,236 పోస్టుల నోటిఫికేషన్లను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకటనతో రాష్ట్రంలో నిరుద్యోగ యువతలో మళ్లీ ఆశలు చిగురించాయి.

Revanth Reddy : 56 వేల ఉద్యోగల భర్తీకి రేవంత్ ప్లాన్.. ఏ శాఖల్లో ఎన్ని ఉన్నాయంటే..!
Revanth Reddy విడతల వారికీ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్దమైన రేవంత్ సర్కార్
శాఖల వారీగా ప్రభుత్వానికి నివేదికలు అందడంతో ఉద్యోగ భర్తీకి సంబంధించి వివరణాత్మక ప్రణాళిక రూపొందించబడింది. పోలీసు శాఖలో 12,150 పోస్టులు (కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు), వైద్య ఆరోగ్య శాఖలో 2,762 పోస్టులు (డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు), ఆర్టీసీలో 3,038, ఇంజినీరింగ్ విభాగాల్లో 2,510, వ్యవసాయ శాఖలో 148, ఆర్‌అండ్‌బీ శాఖలో 185-200 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. అలాగే మహిళా, శిశుసంక్షేమ శాఖలో 14,236 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో గ్రామ పరిపాలన అధికారులుగా 10,954 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా, గ్రూప్-1, గ్రూప్-2, 3, 4 లాంటి ముఖ్యమైన ఉద్యోగాల భర్తీకి కూడా కసరత్తు కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 2024-25 జాబ్ క్యాలెండర్‌ను రూపొందించింది. ఈ నెల చివరి వారం నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ నోటిఫికేషన్లు విడుదల అయ్యే అవకాశం ఉంది. గతంలో రిజర్వేషన్ల కారణంగా నిలిపివేసిన నోటిఫికేషన్లు ఇప్పుడు తిరిగి ప్రారంభమవడం పట్ల నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఉద్యోగ భర్తీల దిశగా వేగంగా ముందడుగు పడటంతో ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఒత్తిడిగా మారుతుందా? అన్న ఆసక్తికర చర్చ మొదలైంది.