GPO Posts : నిరుద్యోగులకు శుభవార్త.. జీపీవో పోస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!
ప్రధానాంశాలు:
GPO Posts : నిరుద్యోగులకు శుభవార్త.. జీపీవో పోస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామక విధానాన్ని అనుసరిస్తూ, ఇప్పుడు జీపీవోల నియామకాన్ని కూడా అదే పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటివరకు 10,954 జీపీవో పోస్టులను మంజూరు చేసింది.

GPO Posts : నిరుద్యోగులకు శుభవార్త.. జీపీవో పోస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!
GPO Posts భూభారతి అమలు కావడం తో జీపీవోల పోస్టుల విషయంలో కీలక నిర్ణయం
మొదట ఈ పోస్టుల్లో కొంత భాగాన్ని వీఆర్ఏలు, వీఆర్వోలతో నింపాలని ప్రభుత్వం భావించినా, సర్వీస్ సమస్యలు, కోర్టు కేసుల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని పునరాలోచిస్తోంది. ఇప్పటికే 7 వేల మందికి అర్హతలు ఉన్నట్టు సమాచారం. వీరికి పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాలని యోచించినా, వారు పాత సేవల హక్కులను కోల్పోతున్నారని కోర్టును ఆశ్రయించడం వల్ల సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఆయా శాఖల్లో ఖాళీలు ఏర్పడకుండా, పూర్తిగా నేరుగా రిక్రూట్ చేయడం మంచిదని ప్రభుత్వం భావిస్తోంది.
జీపీవో పోస్టులకు సంబంధించి సుదీర్ఘంగా ఆలోచించిన ప్రభుత్వం, జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాదిరిగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడం వల్ల స్పష్టత ఏర్పడుతుందని, నిరుద్యోగ యువతకు మంచి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నది. వీఆర్ఏలు, వీఆర్వోలను తీసుకోవడం వల్ల ఇతర శాఖల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో, తుది నిర్ణయానికి ముందు ఉన్నతాధికారుల నుంచి నివేదిక కోరినట్టు సమాచారం. నివేదిక వచ్చిన అనంతరం, జీపీవో నియామకంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.