Home » Karimnagar » Minister Gangula Kamalakar Wishes To Teachers On Teachersday
karimnagar

Karimnagar.. సర్వేపల్లి స్ఫూర్తితో ముందుకెళ్లాలి: మంత్రి గంగుల

Authored By
praveen T
The Telugu News | Updated on: September 5, 2021, 12:46 pm
Advertisement

సెప్టెంబర్ 5.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉపాధ్యాయులందరికీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ అని మంత్రి గంగుల తెలిపారు.

Advertisement

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ స్ఫూర్తితో ఉపాధ్యాయులందరూ విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేయాలని మంత్రి కమలాకర్ సూచించారు. విద్యార్థులు సైతం గురువుల పట్ల గౌరవాభిమానాలు కలిగి ఉండాలని కమలాకర్ చెప్పారు. తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులను ఎప్పుడూ మరిచిపోవద్దని పేర్కొన్నారు. టీచర్ అయిన సర్వేపల్లి రాధాకృష్ణ దేశ రాష్ట్రపతి పదవిని అలంకరించి, ఆ పదవికే వన్నె తెచ్చారని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. ఇకపోతే రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు, అధికారులు సన్మానించారు.

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి