Huzurabad : హుజూరాబాద్‌లో పార్టీల సీక్రెట్ సర్వేలు.. ఎవరికి ఫాయిదా…?
తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు ఎంత కీలకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గెలుపు కోసం బీజేపీ, టీఆర్ ఎస్ తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇక్కడి గెలుపు ఈ రెండు పార్టీలకు చాలా ముఖ్యం. ఇక్కడ గనక ఓడిపోతే రాబోయే ఎన్నికల్లో దాని ఎఫెక్ట్ ఉంటుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఎలాగైనా గెలిచి తమకు తిరుగు లేదని నిరూపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఐదు నెలలుగా ఇక్కడ విజయకేతనం ఎగరేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాయి. కాగా ఇందులో […]
తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు ఎంత కీలకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గెలుపు కోసం బీజేపీ, టీఆర్ ఎస్ తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇక్కడి గెలుపు ఈ రెండు పార్టీలకు చాలా ముఖ్యం. ఇక్కడ గనక ఓడిపోతే రాబోయే ఎన్నికల్లో దాని ఎఫెక్ట్ ఉంటుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఎలాగైనా గెలిచి తమకు తిరుగు లేదని నిరూపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఐదు నెలలుగా ఇక్కడ విజయకేతనం ఎగరేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాయి. కాగా ఇందులో బీజేపీ ఓ అడుగు ముందుందనే చెప్పాలి.
ఈటలకు చెక్ పెట్టేందుకు టీఆర్ ఎస్ ఏకంగా దళితబంధు లాటి స్కీమ్‌ను తీసుకొచ్చిందంటే ఈటల ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు సీక్రెట్ సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్ ప్రధానంగా సానుభూతి, ఆత్మగౌరవ అస్త్రాలను నమ్ముకుంటున్నారు. దీంతో ఇక్కడ ఆయనకు ప్రజల్లో సానుకూల అంశాలతో పాటు ఏవైనా వ్యతిరేక పవనాలు ఉన్నాయా అనే అంశాలపై రీసెంట్ గానే సీక్రెట్ గా సర్వేలు నిర్వహించారంట. తన ప్రత్యేక సిబ్బంది ద్వారా ఆయన ఈ సర్వేలు నిర్వహిస్తున్నారు.
ఇంకోవైపు టీఆర్ ఎస్ కూడా తాము అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలు ఏ మేరకు అనుకూలంగా ఉంటున్నారో అలాగే ఏమైనా వ్యతిరేకతలు ఉన్నాయా అనే దానిపై కూడా బాగానే సర్వేలు చేయించుకుంటోంది టీఆర్ ఎస్. ఇక మరీ ముఖ్యంగా కేటీఆర్ రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. హుజురాబాద్ సీటు రాకపోయినంత మాత్రాన తమ అధికారం పోదని, ఒక సీటు తగ్గితే వచ్చే నష్టమేం లేదన్నట్టు ఆయన మాట్లాడటంతో బీజేపీ దీన్ని హైలెట్‌చేస్తూ ప్రచారం చేస్తోంది. దాంతో టీఆర్ ఎస్ కూడా వీటన్నింటిపై గ్రామాల్లో సర్వేలు చేయిస్తోంది. తమ పార్టీ గ్రాఫ్ పెరిగిందని ఫలితం వస్తే గనక ఈ నెలలోనే రెండు భారీ సభలు కూడా కేసీఆర్ పెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.