Karimnagar..రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే చర్యలు: డీసీపీ శ్రీనివాస్
తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి తెలంగాణ ప్రజానీకం అంతా వెయిట్ చేస్తున్న సంగతి అందరికీ విదితమే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ బై పోల్ అనివార్యమైంది. కాగా ఈ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ క్రమంలోనే హుజురాబాద్ నియోజకవర్గంలో నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని డీసీపీ శ్రీనివాస్ శనివారం తెలిపారు. పార్టీల నాయకులు సామరస్యంగా ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా సెక్షన్ […]
తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి తెలంగాణ ప్రజానీకం అంతా వెయిట్ చేస్తున్న సంగతి అందరికీ విదితమే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ బై పోల్ అనివార్యమైంది. కాగా ఈ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ క్రమంలోనే హుజురాబాద్ నియోజకవర్గంలో నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని డీసీపీ శ్రీనివాస్ శనివారం తెలిపారు. పార్టీల నాయకులు సామరస్యంగా ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా సెక్షన్ 107 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఈ కేసునమోదు అయితే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా జీవిత కాలం బైండోవర్ కావలసి ఉంటుందని వివరించారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో ఉండే చాన్స్ లేదని తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా, బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.