7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి బంపర్ ఆఫర్.. డీఏ పెంపు.. భారీగా పెరగనున్న జీతాలు
ప్రధానాంశాలు:
2024 లో జనవరిలో పెరగనున్న డీఏ?
50 శాతానికి చేరుకోనున్న డీఏ
డీఏను బేసిక్ వేతానికి యాడ్ చేయనున్న కేంద్రం
7th Pay Commission : ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతోంది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించబోతోంది కేంద్రం. కొత్త సంవత్సరం, సంక్రాంతి కానుకగా బంపర్ ఆఫర్ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ డీఏ పెరగనుంది. ప్రతి సంవత్సరం రెండుసార్లు డీఏ పెరుగుతుందనే విషయం తెలుసు కదా. ప్రతి సంవత్సరం జనవరి, జులైలో డీఏ పెరుగుతుంది. కొత్త సంవత్సరంలో జనవరిలో పెరగాల్సిన డీఏను వెంటనే పెంచేందుకు కేంద్రం సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం ఉన్న డీఏకు మరో 4 శాతం డీఏను పెంచాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ అందుతోంది. పెన్షనర్లకు కూడా డీఆర్ 4 శాతంగా ఉంది. 46 శాతానికి మరో 4 శాతం కలిపితే అది 50 శాతం కానుంది. అంటే.. 50 శాతం డీఏకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేరుకోనున్నారు. దీని వల్ల భారీగా వాళ్ల జీతాలు పెరగనున్నాయి.
గత సంవత్సరం జనవరిలో పెంచాల్సిన డీఏ.. ఉగాది కానుకగా మార్చిలో పెరిగింది. ఇక.. జులైలో పెరగాల్సిన రెండో డీఏ.. దీపావళి కానుకగా పెరిగింది. కానీ.. డీఏ జులై నుంచే అమలులోకి వచ్చింది. ఆ తర్వాత పెరగాల్సిన డీఏ జనవరి 2024 లో ఉంది. దాని కోసం కేంద్రం సమాయత్తం అవుతోంది. ప్రతి సంవత్సరం ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ప్రకారం డీఏ పెరుగుతుంది. ఇప్పటి వరకు జులై నుంచి అక్టోబర్ నెల వరకు మాత్రమే ఏఐసీపీఐ డేటా విడుదలైంది. నవంబర్, డిసెంబర్ నెలల డేటా ఇంకా రావాల్సి ఉంది. ఆ డేటా వచ్చాక డీఏ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
7th Pay Commission : డీఏ స్కోర్ 50 శాతం ఉంటే ఏం జరుగుతుంది?
నిజానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ 50 శాతం దాటలేదు. కానీ.. జనవరి 2024 లో పెరకబోయే డీఏ ప్రకారం చూసుకుంటే డీఏ 50 శాతానికి రానుంది. ఒకవేళ డీఏ 50 శాతానికి చేరుకున్నా.. అంతకంటే ఎక్కువ పెరిగినా.. ఉద్యోగుల జీతాలను సవరించాల్సి ఉంటుంది. వాళ్ల బేసిక్ శాలరీకి డీఏను యాడ్ చేసి మళ్లీ జీరో నుంచి డీఏను లెక్కిస్తూ ఉంటారు. ఎందుకంటే.. డీఏ 50 శాతానికి కంటే ఎక్కువ పెంచడానికి వీలు ఉండదు. కాబట్టి మళ్లీ జీరో నుంచి తదుపరి డీఏను యాడ్ చేస్తుంటారు. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.