PM Kisan : రైతన్నలకు బ్యాడ్ న్యూస్.. పీఎం కిసాన్ స్కీం పై మోసం ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PM Kisan : రైతన్నలకు బ్యాడ్ న్యూస్.. పీఎం కిసాన్ స్కీం పై మోసం ..!

 Authored By anusha | The Telugu News | Updated on :2 December 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  PM Kisan : రైతన్నలకు బ్యాడ్ న్యూస్..

  •   పీఎం కిసాన్ స్కీం పై మోసం ..!

PM Kisan : ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని రైతన్నలకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది ఈ పథకం కింద ప్రయోజనాన్ని పొందుతున్నారు. దేశంలోనే మోస్ట్ పాపులర్ స్కీం లలో ఇది ఒకటి. ఈ పథకం కింద మోడీ సర్కార్ 15 విడతల్లో రైతన్నల ఖాతాలోకి డబ్బులను జమ చేసింది. అంటే ప్రభుత్వం నేరుగా రైతన్నలకు 30000 అందించింది అని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది రైతులు ప్రభుత్వాన్ని మోసగించారు. ఫేక్ డాక్యుమెంట్లు చూపించి పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందుతున్నారని విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ స్లామ్ బీహార్లో బయటపడింది.

దాదాపుగా 1321 మంది రైతులు మోసపూరితంగా పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందారని తెలిసింది..వీళ్ళందరూ కలిసి మోసపూరితంగా ప్రభుత్వం నుంచి కోటి 87 లక్షల రూపాయలను పొందినట్లు గుర్తించారు. ఈ మోసాన్ని గుర్తించిన ప్రభుత్వం వాళ్ల దగ్గర నుంచి డబ్బులను రికవరీ చేసే పనిలో పడింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఈ పనిని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి కొందరు రైతులు ఈ మోసం చేసినట్లు తెలుస్తుంది. మోసం చేసిన రైతులు నుంచి ఇప్పటివరకు 7,35,000 వసూలు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో పిల్లలు, భాగస్వామి ద్వారా కూడా ప్రయోజనాలు పొందుతున్నారని తెలుస్తుంది.

రూల్స్ ప్రకారం కుటుంబంలో ఒక్కరికే ఈ స్కీం వర్తిస్తుంది. భారత ప్రభుత్వం 15 విడత డబ్బులను నవంబర్ 15 రైతుల ఖాతాలోకి జమ చేసింది . ఇకపై 16వ విడత డబ్బులు రావాల్సింది. ఇవి కూడా త్వరలోనే రాబోతున్నాయని అంచనాలు ఉన్నాయి. ఈ పీఎం కిసాన్ పథకంలో ఇంకా ఎవరైనా రైతులు చేరకపోతే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పొలం పట్టా వంటి డాక్యుమెంట్ లు అవసరం అవుతాయి. అలాగే ఫోన్ కి ఆధార్ కార్డు లింక్ చేసి ఉండాలి.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది