LPG cylinders free : కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్…ఈ రేషన్ కార్డు ఉన్నవారికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం…
ప్రధానాంశాలు:
LPG cylinders free : కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్...ఈ రేషన్ కార్డు ఉన్నవారికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం...
LPG cylinders free : 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిపిఎల్ రేషన్ కార్డు ప్రోగ్రామ్ ద్వారా అర్హులైన గ్రహీతలందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లను కేటాయిస్తూ పథకాన్ని ప్రవేశపెట్టింది...
LPG cylinders free : 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిపిఎల్ రేషన్ కార్డు ప్రోగ్రామ్ ద్వారా అర్హులైన గ్రహీతలందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేస్తూ అనునిధన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల యొక్క జీవితాలను మెరుగుపరుస్తూ వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు. వాటిలో ఈ పథకం కూడా ఒకటి అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆధునిక సాంకేతికలు మరియు సౌకర్యాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రభుత్వాలు పురోగతి చేస్తున్నాయి. వాటిలో LPG గ్యాస్ వినియోగం కూడా ఒకటి.
అయితే 2016లో కేంద్ర ప్రభుత్వం అటవీ నిర్మూల అరికట్టడంపై దృష్టి సారించి అలాగే ఇంట్లో వంట ప్రక్రియను సులభం చేయడానికి అర్హులైన అందరికీ ఫ్రీ గ్యాస్ కనెక్షన్లను అందించడం ప్రారంభించింది. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లను కేటాయిస్తూ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం ద్వారా 3 సిలిండర్లను పొందాలంటే BPL రేషన్ కార్డు హోల్డర్స్ మాత్రమే అర్హులు అవుతారు. ఇక 2016లో ప్రారంభించిన ఈ పథకం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక ఈ పథకం ద్వారా ఇప్పటికే చాలామంది అర్హులైన వారు లబ్ధి పొందుతున్నారు.
అయితే ఈ పథకం ద్వారా ప్రయోజనాలను పొందాలంటే కచ్చితంగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తుదారులు తప్పనిసరిగా బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ పథకానికి అర్హులవుతారు. కావున అర్హులైన కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనాలను పొందాలంటే
www.pmuy.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
LPG cylinders free : కావాల్సిన పత్రాలు…
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు , బ్యాంకు వివరాలు మరియు అవసరమైన ఇతర పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు…
అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఏటా మూడు ఉచిత సిలిండర్లు అందించి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే సాంప్రదాయ కలప ఆదారిత వంట పద్ధతులు నుండి ఆధునిక వంట పద్ధతులకు మారడం, మరీ ముఖ్యంగా గృహినీలకు వంట పని సులభతరం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.