Good News : ఉచిత గ్యాస్ సిలిండర్ పై మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్… మహిళలు వెంటనే దరఖాస్తు చేసుకోండి..!
Good News గతంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇంట్లో కట్టెల పొయ్యి పై గంటలు తరబడి వంటలు చేసేవారు. ఇక ఇప్పుడు మారిన ఆధునిక కాలంలో భాగంగా గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు విపరీతంగా పెరిగిన ధరల వలన వాటి వినియోగం సామాన్యులకు భారంగా మారింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉజ్వల యోజన పతకం ద్వారా సామాన్యులకు ఉచిత LPG సిలిండర్లను అందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇక్కడ ఉంది.
అయితే కేంద్ర ప్రభుత్వం బీజేపీ హయాంలో 2016 లోనే ఉజ్వల యోజన పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. అయితే ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు చాలామంది దీని ద్వారా ప్రయోజనం పొందారు. మరియు ఇప్పటికి దీని కోసం చాలామంది అప్లై చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పథకం ద్వారా సహాయం కోరుతున్న వారికి ఒక అవకాశం వచ్చింది. ఉచిత గ్యాస్ సిలిండర్ కు అర్హత సాధించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్దిష్ట అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Good News అర్హత ప్రమాణం…
1) ఈ పథకం ద్వారా ఉచిత సిలిండర్ పొందాలంటే కచ్చితంగా మహిళలు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
2) గా దారిద్ర రేఖకు దిగువన బిపిఎల్ ( BPL )కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
3) భారతీయ నివాసానికి సంబంధించిన ఒరిజినల్ రుజువు కచ్చితంగా అవసరం అవుతుంది.
4) దరఖాస్తుదారుల యొక్క ఆధార్ కార్డు తప్పనిసరి.
5) ఉపయోగంలో ఉన్న మొబైల్ నెంబర్ మరియు వయస్సు రుజువు ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి.
6 ) ఉజ్వల యోజన సబ్సిడీని సేకరించడానికి బ్యాంకు వివరాలతో పాటు ఆధార్ కార్డు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో కాపీలు అవసరమవుతాయి.
కొత్తగా దరఖాస్తు చేయాలంటే…
ఈ పథకానికి అర్హత పొందడానికి అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా సంబంధిత ఆఫీసీల్ వెబ్ సైట్ సందర్శించాలి. https://www.pmuy.gov.in.
వెబ్ సైట్ ఓపెన్ అయిన తర్వాత న్యూ ఎంటర్ ఎంపికపై నొక్కాలి.
రాష్ట్రం జిల్లా మరియు చూపించిన పూర్తి వివరాలను పూరించాలి.
ఖచ్చితమైన వివరాలతో మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫారమ్ ను పూర్తి చేయాలి.
Good News ఆధార్ లింక్
కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనాల ప్రకారం వివిధ స్థాయిలలో ఆధార్ లింకు తప్పనిసరిగా ఉండాలి. కావున ఉజ్వల యోజన పథకానికి అర్హత పొందాలంటే మీ ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడం చాలా ముఖ్యం.ఇక ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించడానికి పైన ఇవ్వబడిన ప్రభుత్వ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.